DailyDose

ఏపీలో చల్లని బీరు బంద్-తాజావార్తలు–08/24

No more chilled beer in andhra-telugu breaking news today--08/24

* ఇది మందుబాబులకు రుచించని వార్త. చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి ఏపీ మొత్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. చల్లని బీరు అమ్మకాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఇకపై లిక్కర్‌ తరహాలోనే బీర్లు కూడా కూలింగ్‌ లేకుండా వినియోగదారులకు విక్రయిస్తారు. ఈ నిర్ణయం బీరు అమ్మకాల పై పడి..పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.
* భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ (66) మృతిపట్ల పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పలువురు నేతలు అభిప్రాయడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు.
* అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఈ రోజు రాత్రి కైలాశ్‌ కాలనీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు భాజపా కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు.
* భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి, నాలుగో సీడ్‌ యూఫీచెన్‌ (చైనా)ను 21-7, 21-14 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మూడో సారి ఫైనల్‌కు చేరుకొని పసిడి పోరుకు బాటలు వేసుకొంది.
* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం కలిసింది. రాజధాని పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు.
* ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్‌ జీడీపీ 2019లో 6.2కు మాత్రమే పరిమితం అవుతుందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. గతంలో ప్రకటించిన 6.8శాతం కంటే ఇది చాలా తక్కువ. ఇక 2020లో భారత ఆర్థిక వ్యవస్థ 6.7శాతంతో వృద్ధి సాధిస్తుందని తెలిపింది. దీనిలో కూడా 0.6శాతం కోత విధించింది. ఈ అంచనాలే నిజమైతే భారత్‌ వృద్ధిరేటును చైనా వృద్ధిరేటు సమానం చేస్తుంది.
* భాజపా సీనియర్‌నేత అరుణ్‌జైట్లీ (66) మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన ఉన్నపళంగా దిల్లీ బయల్దేరి వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణ్‌ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, అత్యంత సన్నిహితుల్లో ఒకరని అన్నారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటు అని చెప్పారు. ‘జైట్లీ ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌, న్యాయకోవిదుడు’అని కొనియాడారు.
* ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవని, విధానాలపై మాత్రమే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు. ప్రతిసారీ ప్రతిపక్షాన్ని విలన్‌గా చూపడం ఆపాలని మోదీకి ఎప్పుడైనా సూచించారా అని అడిగారు. పార్టీలకతీతంగా మంచి పనులను మెచ్చుకునే సాంప్రదాయం కేవలం కాంగ్రెస్‌ వారికి మాత్రమే ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
* కెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారు. అయితే వారు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
* జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు తిరిగి వెనక్కి పంపించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అక్కడ నెలకొన్న పరిస్థితులపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు జమ్మూకశ్మీర్‌ పర్యటనకు బయలుదేరారు.
* తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ లోకల్ అడ్వైసరీ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్.
* భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి, నాలుగో సీడ్‌ యూఫీచెన్‌ (చైనా)ను 21-7, 21-14 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మూడో సారి ఫైనల్‌కు చేరుకొని పసిడి పోరుకు బాటలు వేసుకొంది.
*విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో దీన్ని వాయిదీ వేశారు. వాస్తవానికి ఈనెల 26న రైల్వే శాఖ సహాయ మంరి సురేష్ అంగడి ప్రారంభించాల్సి ఉంది.
*గుండె జబ్బులున్నోళ్లు రోజు రకరకాల టాబ్లెట్లు వేసుకోవడం చూస్తుంటాం. బీపీ, నొప్పి తగ్గించటానికి, కొవ్వు తగ్గటానికి, స్ట్రోక్‌‌కు విడివిడిగా మందులు వాడుతుంటారు. మరి, నాలుగు మందులు ఒకే టాబ్లెట్‌‌లో కలిసి ఉండే ఫోర్‌‌ ఇన్‌‌ వన్‌‌ టాబ్లెట్‌‌ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా! అందుకే ఇరాన్‌‌, బ్రిటన్‌‌ సైంటిస్టులు కలిసి ఓ పాలీపిల్‌‌ను తయారు చేశారు. నొప్పిని తగ్గించి రక్తాన్ని పలుచన చేసే ఆస్పిరిన్‌‌తో పాటు కొవ్వు కరిగించే స్టాటిన్లు, బీపీ మందు, స్ట్రోక్స్‌‌ తగ్గించే మందులను కలిపి ఒకే టాబ్లెట్‌‌గా తయారు చేశారు. గుండె జబ్బులు లేని వాళ్లు ఈ పాలీపిల్‌‌ వాడితే గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. వాళ్లతో పోలిస్తే గుండె జబ్బులు ఉన్న వాళ్లు వీటిని వాడితే తగ్గే రిస్క్‌‌ కేవలం సగమన్నారు. ఇరాన్‌‌లోని 100 పల్లెలకు చెందిన 7000 మందిపై ఈ పాలీపిల్‌‌ను పరీక్షించారు. రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశీలించారు. ఒక గ్రూపుకు కేవలం లైఫ్ అడ్వైస్‌‌, మరికొందరికి పాలీపిల్‌‌ ఇచ్చారు. పాలీపిల్‌‌ వేసుకున్న వారు 34 శాతం తక్కువ సైడ్‌‌ ఎఫెక్ట్‌‌లు ఎదుర్కొన్నట్లు పరిశోధనలో తేలింది. బీపీలో తేడాలు లేవు. కొవ్వు శాతం తగ్గింది. కేవలం ఈ పాలీపిల్‌‌ వేసుకున్నంత మాత్రాన సరిపోదని ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, సిగరెట్‌‌ స్మోకింగ్‌‌కు దూరంగా ఉండటం చాలా అవసరం అని సైంటిస్టులు చెబుతున్నారు.
* భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్‌ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. తొలుత గ్రౌండ్‌ ఫ్లోర్‌ వ్యాపించిన మంటలు.. బెడ్‌ రూమ్‌ వరకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బెడ్‌ రూమ్‌ పూర్తిగా దగ్థమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎవరకూ గాయపడలేదు.
* భారత పేసర్‌ బుమ్రాను ఎదుర్కోవడం కన్నా డెన్నిస్‌ లిల్లీని ఎదుర్కోవడమే నయమని వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ అన్నాడు. ‘‘నేను వేగంగా బంతులేసే బౌలర్‌ను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతా. అయితే బుమ్రాను ఆడటం మాత్రం సులువు కాదు.
* ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) శుక్రవారం భారత జాతీయ డోప్‌ టెస్టింగ్‌ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్‌)ని ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేసింది. 2008లో వాడా నుంచి గుర్తింపు పొందిన ఎన్‌టీడీఎల్‌కు ఇక ఆటగాళ్ల నమూనాలను పరీక్షించే అధికారం ఉండదు.
* ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల భారత నిరీక్షణకు సాయిప్రణీత్‌ తెరదించాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొనె 1983లో కాంస్య పతకం సాధించగా.. శుక్రవారం సాయి ప్రణీత్‌ భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. ఈ ఏడాది స్విస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి.. జపాన్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరుకున్న సాయి అద్వితీయమైన ఆటతో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ను చిత్తుచేశాడు. 51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పోరాటమంతా తొలి గేమ్‌లోనే. ఇద్దరు ఆటగాళ్లు తమ శక్తినంతా ప్రయోగించారు. చివరి పాయింటు వరకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.
* ఆధార్‌ లో మార్పుల కోసం.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీ సేవా కేంద్రం వద్ద శనివారం భారీ తోపులాట చోటు చేసుకుంది. విజయనగరం మీ సేవ కేంద్రం వద్ద ఉదయం నుండి వందలాదిగా జనం బారులు తీరారు. కిలోమీటరు వరకు క్యూలైన్‌ ఉండటంతో, తోపులాట జరిగింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆధార్‌ మార్పుల కోసం ఎండలో చంటిపిల్లలతో ప్రజలు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు.
* జీవీఎంసీ కమిషనర్‌ ఈ నెల 22వ తేదీన ఇచ్చిన నోటీసును సవాల్‌ చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్‌, గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత హై కోర్టులో హౌస్‌మోషన్‌ (అత్యవసర) పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు సూచనలు పట్టించుకోకుండా జీవీఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారంటూ పిటిషనర్లు అత్యవసరంగా వేసిన పిటీషన్ ను అ జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ శుక్రవారం తెల్లవారుజామున విచారణ జరిపారు.
* ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు ఆఫీస్ గా ఉన్న భీమిలిలోని గెస్ట్ హౌస్ ల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఈ భవన యజమాని కంచర్ల రవీంద్రనాథ్, గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత అత్యవసర పిటీషన్ వేసి హై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గంటాకు ఊరటనిచ్చింది.
* ఆధార్‌ లో మార్పుల కోసం.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీ సేవా కేంద్రం వద్ద శనివారం భారీ తోపులాట చోటు చేసుకుంది. విజయనగరం మీ సేవ కేంద్రం వద్ద ఉదయం నుండి వందలాదిగా జనం బారులు తీరారు. కిలోమీటరు వరకు క్యూలైన్‌ ఉండటంతో, తోపులాట జరిగింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆధార్‌ మార్పుల కోసం ఎండలో చంటిపిల్లలతో ప్రజలు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు.
* అరకులోయ పట్టణ సమీపంలో లోతేరు రహదారిలో శారదా నికేతన్ పాఠశాల జంక్షన్ వద్ద గిరిజన యువతి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* లండన్‌లో తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడి కుమారుడు హర్ష అదృశ్యంపై ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరా తీశారు. తెలుగు విద్యార్థి అదృశ్యంపై కేంద్రానికి లేఖ రాస్తానని, ఆచూకీ కోసం తనవంతు కృషి చేస్తానని నామా హామీ ఇచ్చారు.
* ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడల్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఘటనాస్థలానికి సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చేరుకోలేక పోతున్నారు. అంబుజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ప్రాంతాల్లో కూడా నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
* తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు.
* సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా సమాచారంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్…. అనుమానస్పదంగా ఎవరూ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
* కర్నూలు శ్రీశైలం జలాశయానికి స్వల్పంగ వరద ఇన్ ఫ్లో :22,613 క్యూసెక్కులు ఔట్ ప్లో : 89,361 క్కులు
నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలుప్రస్తుతం : 205.2258. టిఎంసిలు.పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులుప్రస్తుతం : 883.10 అడుగులుకుడి , ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
* నల్గొండ జిల్లా…నాగార్జున సాగర్ ప్రాజెక్టుర్తిస్థాయి లో నీటిమట్టం క్రస్ట్ గేట్లు నిల్ఇన్ ఫ్లో:… 59,418సెక్కులు…
ఔట్ ఫ్లో…. 54,120 క్యూసెకులు.పూర్తి స్థాయి నీటి మట్టం:590 అడుగులు..కాగా,,ప్రస్తుత నీటి మట్టం:590.00 అడుగులు..పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:312 టీఎంసీ లు కాగా,, ప్రస్తుతం:.312.0450 టీఎంసీలు
* మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ పురాతన భవనం కూలిపోయింది. భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.
* మెగాస్టార్‌ చిరంజీవి ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం వస్తున్నారు. విశ్వనటుడు ఎస్‌వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ప్రత్యేక జెట్‌ విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో తాడేపల్లిగూడెం వస్తారు. హౌసింగ్‌ బోర్డులో ఏర్పాటు చేసిన ఎస్‌వీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తాడేపల్లిగూ డెం ఎస్‌వీఆర్‌ సేవా సమితి గూడెంలో కొన్ని నెలల కిందటే ఎస్‌వీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.అయితే చిరంజీవితో ఆవిష్కరింప జేయాలని ఎస్‌వీఆర్‌ సేవా సమితి సభ్యులు సంకల్పించారు. దాంతో విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లి ఎస్‌వీఆర్‌ సేవా సమితి సభ్యులు నేరుగా చిరంజీవిని ఆహ్వానించారు. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు…
*అరుదైన నార్తర్న్‌ శ్వేత జాతి ఆడ ఖడ్గమృగాలివి. ప్రస్తుతం కెన్యాలోని ఓల్‌ పెజెటా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి. భూగోళంపై జీవించి ఉన్న నార్తర్న్‌ శ్వేత జాతి ఖడ్గమృగాలు ఈ రెండే. పూర్తిగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో వన్యప్రాణి నిపుణులు వాటి అండాలను గురువారం సేకరించారు. వాటి ద్వారా ఆధునిక పద్ధతుల్లో సంతానోత్పత్తి జరిపించాలన్నది నిపుణుల యోచన.
*ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తెలుగు షట్లర్లు అదరగొట్టారు. పూసర్ల వెంకట సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీలో ఈ స్టార్ షట్లర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లి కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు.
*విద్యుత్ సంస్థలు ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇస్తూ పారదర్శకంగా, అవినీతిరహితంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆరోపణలపైన అయినా సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకైనా మేం సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాం’’ అని రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు.
*తెలంగాణలో విద్యుత్తు కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఆధారాలతో నిరూపించేందుకు భాజపా సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.
*తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదులు తడకమళ్ల వినోద్కుమార్, అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి, కూనూరు లక్ష్మణ్లను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
*అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా శరవేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు పనులపై శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ఆయన..వచ్చే వర్షాకాలంనాటికి పంట పొలాలకు నీరు అందించాలన్నారు.
*కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం ఉదయం జరిగే ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.
*తమిళనాడులోకి లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
*పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకొనే హక్కు ఉంటుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు.
*ఫోక్స్వ్యాగన్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
*టీఎస్సెట్-2019 ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్రెడ్డి శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేశారు.
* ఎయిర్ఏసియా విమానయాన సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు నడిచే అన్ని విమాన సర్వీసుల టికెట్లపై 20 శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎయిర్ ఏసియా ఉన్నతాధికారి సంజయ్కుమార్ తెలిపారు.
*సిద్దిపేట జిల్లాలోని ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, తొగుట గ్రామాల్లో మల్లన్నసాగర్ జలాశయానికి సంబంధించిన పనులను వారం రోజులపాటు నిలిపివేయాలని శుక్రవారం హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.