Business

మరోసారి వడ్డీరేట్లు తగ్గించిన SBI

SBI reduces interest rates for the second time

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండోసారి వడ్డీరేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఈ నెల ఒకటవ తేదీన మొదట.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా, మళ్లీ వడ్డీ రేట్లను సవరించింది. ఇవి ఈ నెల 26 వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల విషయానికి వస్తే రిటైల్‌ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 30 నుంచి 70 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఎస్‌బీఐ. ఇక, 7 నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5 శాతం నుంచి 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 5.5 శాతానికి, 180 నుంచి సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీరేటును 6.25శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది.