1.ఆ ఆలయాన్ని బంగారంతో రూపొందించారు – ఆద్యాత్మిక వార్తలు 08/24
ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రువారం గుడిని అందంగా అలంకరిస్తారు.శ్రీపురం స్వర్ణదేవాలయం ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.[1]. దీని నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది.[2]. ఆలయ ఆవరణం మొత్తం నక్షత్రం ఆకారం గల ప్రాకారంతో ఆవరించబడి ఉంటుంది.గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుంచి సేకరించిన శ్లోకాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు. శ్రీ విద్య అనే ప్రాచీనమైన మరియు అరుదైన శక్తి పూజా విధానాన్ని అనుసరిస్తారు.నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే సమకూరాయాని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశాడు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించాడు
2. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 24*
1908 : స్వాతంత్ర ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు, రాజ్ గురు జననం (మ.1931).
1923 : సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా జననం (మ.2010).
1927 : తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత అంజలీదేవి జననం.(మ.2014)
1928 : ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్య జననం.(మ.2015)
1929 : మాజీ పాలస్తీనా లిబరేషన్ సంస్ధ చైర్మన్ యాసర్ అరాఫత్ జననం.(మ.2004)
1981 : అమెరికా నటుడు, చాడ్ మైఖేల్ ముర్రే జననం.
1985 : తెలుగు సినీ గాయని గీతా మాధురి జననం.
1993 : ప్రజావైద్యుడు, గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ మరణం (జ.1904).
2009 : వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడు కన్నెగంటి వేంకటేశ్వరరావు మరణం
3. శుభమస్తు
తేది : 24, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న ఉదయం 8 గం॥ 8 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 47 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 15 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 8 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 42 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 54 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 36 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : వృషభము
4. ప్రహ్లాద సమే స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
24.08.2019 వతేది, *శనివారము ఆలయ సమాచారం
శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..శ్రావణ మాసము 4 వశనివారము సందర్భముగా ఉదయము 5.30 గంటల నుండి శ్రీస్వామి వారికి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును నిర్వహించెదరుస్వామి వారి దర్శనము ఉదయము 7.30 గంటల నుండి మ. 2.00 గంటలకు వుండును
*శ్రావణ బ|| అష్టమి రోహిణి నక్షత్రము పురస్కరించుకొని ఆలయ తూర్పూ రాజగోపురము ముందుభాగమున శ్రీ క్రిష్ణాస్వామి ఆలయములో ఉదయము 10.00 అభీషేకం, అస్థాన ఫూజ కార్యక్రమము నిర్వహించెదరు*
రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ 1.00 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
*క్రిష్ణా అష్టమి పండుగ సందర్భముగా ఆలయ తూర్పు రాజగోపురము ముందు భాగమున వున్న క్రిష్ణా మందిరములో స్వామి వారి అస్థాన పూజ అనంతరము సాయంత్రము 8.00 గంటలకు ఉయాలోత్సవము కార్యక్రమము నిర్వహించబడును* రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేల వివరములు*
*24.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 105*
*24.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 13*
5. తిరుమల సమాచారం**ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు శనివారం *24-08-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం……
శ్రీవారి దర్శనానికి *19* కంపార్ట్ మెంట్లలలో వేచి ఉన్న భక్తులు….
శ్రీవారి సర్వ దర్శనానికి *10* గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది….
నిన్న ఆగస్టు *23* న *78,020* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 3.06* కోట్లు.
6. శ్రీ వారికి ఆర్ ఎస్ బ్రదర్స్ 2 కోట్లు విరాళం …
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్‌ఎస్ బ్రదర్స్ అధినేతలు సందర్శించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారి అన్నప్రసాద పథకానికి రూ. కోటి, శ్రీవాణి పథకానికి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. రూ. 2 కోట్ల చెక్కును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆర్‌ఎస్ బ్రదర్స్ అధినేతలు అందజేశారు.
7. తిరుపతమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని తిరుపతమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. 1500 మంది మహిళలు పాల్గొన్నారు. వారికి దేవాలయం తరఫున పూజాసామగ్రి ఉచితంగా అందజేశారు. విశాలమైన ఆలయ ముఖమండపం భక్తులతో నిండిపోయింది. వ్రతాల్లో పాల్గొన్న ప్రతి మహిళకు అమ్మవారి కానుకగా లక్ష్మీదేవి రూపు, జాకెట్‌ముక్క, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ అత్తులూరి అచ్యుతరావు, ఈవో శోభారాణి, డీఈ రమ, ధర్మకర్తలు రాయపుడి అనిల్, గింజుపల్లి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
8. అమృత వాక్కులు
1.సాధ్యానికి అసాధ్యానికీ మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే.
2.గొంతు పెంచడం కాదు. నీ మాట విలువ పెంచుకో. వాన, చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు.
3.మనిషికి అనుమానం ఎక్కువైతే వివేకం నశిస్తుంది
4.అన్ని కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవటానికి.
5.మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్ని పరాభవాలు ఎదురైనా,మనకు రావలసినవి ఆందక పోయినా, మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం….. అది చాలా ముఖ్యమైనది. అనేక కారణాలు మనకు అధర్మ మార్గంలో పయనించడానికి అనుమతి అనుకోకూడదు – ఏ పరిస్థితులలోను ధర్మాన్ని వదలు కోకూడదు.