ఆంధ్రప్రదేశ్ మూలాలను గుర్తిస్తూ మాతృభూమితో అనుసంధానం కావడానికి, రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఒక వేదిక అవసరాన్ని గుర్తించి ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికాని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. టెక్సాస్ రాష్ట్రంలోని అలెన్ నగరంలో డాక్టర్ అబ్దుల్ రహమాన్ నివాసంలో దాదాపు 15 ముస్లిం కుటుంబాలు సమావేశమయి ఆంధ్రప్రదేశ్ ముస్లిముల ప్రాతినిధ్యం గురించి, తెలుగు సమాజంలో మమేకవ్వడం గురించి, అమెరికాలో నివసిస్తున్న ఆంధ్ర ముస్లింలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి సామాజిక, సాంఘిక అవసరాలలో తోడ్పాటు అందించడం గురించి చర్చించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, మహమ్మద్ ఇక్బాల్ గగ్గుతురు, అక్బర్ సయ్యద్, షాజహాన్ షేక్, మస్తాన్ షేక్, షఫీ మహమ్మద్, ముజాహిద్ షేక్, ఫైజ్ షేక్, కాలిఫోర్నియా నుంచి అబ్దుల్ ఖుద్దూస్, జాకిర్ మహమ్మద్, నసీం షేక్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా-AMANA ప్రారంభం
Related tags :