Food

బోద కాకర వేపుడు…

Bodha Kakara Fry - Telugu Easy Short Fast Recipes

ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆకాకర కాయల్నే ‘బోడ కాకర’ అని కూడా పిలుస్తుంటారు. ఇవి అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.. సాధారణ కాకర తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలెర్జీలు దూరం అవుతాయి.. ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.. క్యాన్సర్ల బారిన పడకుండా అడ్డుకుంటుంది. ఇందులోని విటమిన్ -సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.. వీటిలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.. బోడ కాకర కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. వీటిని తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.. వీటిని వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసేయకుండా వండాలి.