Movies

మంగళకరంగా వసూళ్లు

Mission Mangal Movie Making Masth Money

‘మిషన్‌ మంగళ్’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతమైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.149.31 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ చిత్రం తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.29.16 కోట్లు రాబట్టి.. నటుడు అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా నిలిచింది. రెండో రోజు (ఆగస్టు 16) రూ.17.28 కోట్లు, మూడో రోజు రూ.23.58 కోట్లు, నాలుగో రోజు రూ.27.54 కోట్లు, ఐదో రోజు రూ.8.91 కోట్లు, ఆరో రోజు రూ.7.92 కోట్లు, ఏడో రోజు రూ.6.84 కోట్లు, ఎనిమిదో రోజు రూ.6.93 కోట్లు, తొమ్మిదో రోజు రూ.7.83 కోట్లు, పదో రోజు రూ.13.32 కోట్లు మొత్తం రూ.149.31 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అక్షయ్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాకు జగన్‌ శక్తి దర్శకత్వం వహించారు. విద్యా బాలన్‌, తాప్సీ, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరీ, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించారు. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ చిత్రం విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది.