యాపిల్ ఐ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ దానిని కొండం ఇప్పుడు ఈజీ అయిపొయింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఐఫోన్లలో 2020 నాటికీ మరో అదనపు ఆకర్షణ రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి టెక్నాలజీ వర్గాలు. అంతర్జాతీయ స్థాయిలో 2020 నాటికి టైం ఆఫ్ ప్లైట్ 3డీ సెన్సార్ కెమెరాను ఆపిల్ ఫోన్ లలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి ఈ తరహా కెమెరా వ్యవస్థను ఐ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారు. రూమర్లు వచ్చాయి. కానీ ఐఫోన్ వర్గాలు మాత్రం అది లేజర్ టెక్నాలజీ కలిగిన కెమెరా 2020 కి రాబోయే ఐ ఫోన్లలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రూ డెప్త్ కెమెరాలో ఎన్నో విశిష్ట లక్షణా లుంటాయి. పేస్ ఐడీ యానిమోజి, ప్రోత్రేయిట్ మోడ్ సేల్ఫీలు తీసుకోవచ్చు. ఐ ఫోన్ల కంటే ముందుగా ఐ ఫోన్ ఐ పాడ్స్ లో ఈ తరహా కెమెరాను ముందుగా ఏర్పాటు చేయబోతున్నట్లు యాపిల్ అనలిస్ట్ మింగ్ చికు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి టైం ఆఫ్ ఫ్లిట్ కెమెరా మోడ్ అత్యాధునిక నాలుగు మోడల్స్ కలిగిన ఫోన్ల మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. 5.4 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.7అంగుళాలు కలిగిన ఓఎల్ఇడీ స్క్రీన్లు కలిగిన ఫోన్లు రానున్నాయి. ఈ ఫోన్లన్ని 5జి కనెక్టివిటి సదుపాయం కలిగి ఉంటాయని తెలుస్తోంది. 5జి సదుపాయం లేని ఐఫోన్ 8మోడల్ తరహాలోనే ఇవి ఉంటాయని తెలుస్తోంది.
ఐఫోన్‌లో మరో సాంకేతికత
Related tags :