స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పారు ఆ సినిమాలో చేయొద్దని. అయినా వినకుండా చేసింది. సినిమాకి పేరైతే వచ్చింది కానీ ఆ తరువాత అవకాశాలు మాత్రం అస్సలు రావట్లేదు. దాంతో తల పట్టుకుంటోంది హీరోయిన్ రెజీనా. ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రెజీనా ఎక్కువ సినిమాలు మెగా వారసులతో చేయడంతో మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ ఈ మద్య తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. మళ్లీ ‘ఎవరు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అడపా దడపా తమిళంలో అవకాశాలు చేజిక్కించుకుంటున్న రెజీనాకు బాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. సోనమ్ కపూర్‌తో కలిసి ఏక్ లడ్కికో దేఖాలో నటించే అవకాశం. ఇందులో రెజీనాది లెస్బియన్ పాత్ర. కథ విన్నాక చాలా రోజులు ఆలోచించిందట. ఫ్రెండ్స్‌ని అడిగితే ఆ పాత్ర చేయొద్దని చెప్పారట. అందరూ వద్దంటున్నారు.. అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అని చాలెంజింగ్‌గా తీసుకుని చేసేసింది. సినిమాలో తన నటనకిగాను మంచి పేరే తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని రెజీనా ఆశించింది. అయితే ఒక్క అవకాశమూ రాలేదు. ఇప్పుడు ఎవరూతో హిట్ కొట్టిన రెజీనాకు టాలీవుడ్ మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి.
ఎదురుచూపుల్లో రెజీనా
Related tags :