Movies

బ్రేకప్

Actress Ileana Breaks Up With Boy Friend

గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్‌ అయ్యాయి. ఇద్దరూ సోషల్‌మీడియా ఖాతాల్లో అన్యోన్యంగా దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ‘ఈ ఫొటో తీసింది మావారే’ అంటూ క్రిస్మస్‌ ట్రీని అలంకరిస్తున్న ఫొటోను ఇలియానా గతంలో పోస్ట్‌ చేశారు. ఆండ్రూ కూడా పలు సందర్భాల్లో ఇలియానా అందాన్ని మెచ్చుకుంటూ ఫొటోలు షేర్‌ చేశారు కూడా. దీంతో ఇలియానా అతడిని వివాహం చేసుకున్నారని వదంతులు వచ్చాయి. దీని గురించి నటిని ప్రశ్నించగా.. ‘ఈ విషయంపై కామెంట్‌ చేయడం నాకు ఇష్టం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేమిద్దరం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం. ధన్యవాదాలు.. నా వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలి అనుకుంటున్నా’ అని అన్నారు. ఇలియానా కోసం ఆండ్రూ పలుమార్లు ముంబయికి కూడా వచ్చారు. కాగా ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్నేళ్లపాటు సంతోషంగా ఉన్న వీరు విడిపోవడానికి కారణం ఏంటని కథనాలు రాస్తున్నారు. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఇలియానా స్పందించాల్సిందే.