తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. గతేడాది ఒప్పో.. ఇటీవల అమెజాన్.. ఇవాళ వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్ పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌దేనని అసద్ పేర్కొంటూ.. ఆయనను మళ్లీ సర్కారులో చూసేందుకు వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ అసద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనత అంతా కేటీఆర్‌దే
Related tags :