అధికార భాష సంఘం అధ్యక్షులుగా నియమితులైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో నేడు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా , యువజన అభ్యుదయ శాఖ మంత్రి శ్రీనివాస్ సమక్షంలో ఆయన కార్యాలయంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వేంకటేశ్వర రావు (నాని), రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా , యువజన అభ్యుదయ శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తో పాటు, పలువురు భాషాభిమానులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అధికార భాషా సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యార్లగడ్డ
Related tags :