‘పోయిన సంవత్సరం దుబాయ్ లో పెట్టిన క్షమాభిక్ష లాగా మలేషియా లో కూడా అక్కడి ప్రభుత్వం వీసా లేకుండా నివసిస్తున్న భారతీయులకు డిసెంబర్ 31 లోగ దేశం వదిలి వెళ్లాలని బ్యాక్ ఫర్ గుడ్ ప్రోగ్రాం (క్షమా బిక్ష) ప్రకటించింది.దీనికి రెండు షరతులు విధించింది.మొదటిది 700 రింగ్గిట్ మలేషియా అంటే సుమారు రూ 12000 పెనాల్టీ కట్టాలి.రెండవది ఇండియా కి రావడానికి విమాన టికెట్ చూపించాలి.ఇది సుమారు రూ 8000 వరకు అవుతుంది.వెయ్యికి పైగా తెలంగాణ వాసులు ఇన్నీ పైసలు కట్టలేక టిఆర్ఎస్ మలేషియా మరియు తెలంగాణ సంఘం ద్వారా ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కి ఫోన్ చేసి వాళ్ళ బాధలు చేపిండ్రు.మహేష్ మంగళ వారము నాడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారి దృష్టికి తీసుకవచ్చారు.కేటీర్ గారితో చర్చించి వారి ఆదేశాల ప్రకారం మహేష్ మీడియాతో మాట్లాడుతూ మలేషియా ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించిన సందర్బంగా ప్రభుత్వ ఖర్చులతో తెలంగాణ కు సంబందించిన బాధితులను రప్పించాలని కేటీర్ గారికి వినతి పత్రం అందజేశామని తెలిపారు.ప్రత్యేక ప్రభుత్వ బృందాన్ని మలేషియా కి పంపిందామని కేటీర్ తెలిపారన్నారు .వీరి ద్వారా అక్కడ క్యాంపు లు పెట్టి బాధితులను కలిసి త్వరగా తెలంగాణాకి రాపించాలన్నారు.మలేషియా లో తెలంగాణ బాధితులకు చని పోయిన వారికీ రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని కోరామన్నారు.పోయిన సంవత్సరం దుబాయ్ లో కూడా ఆమ్నెస్టీ విదిస్తే సీఎం కెసిఆర్ గారు ప్రభుత్వ బృందాన్ని దుబాయ్ పంపించి ప్రభుత్వ ఖర్చులతో 600 మందిని తెలంగాణ కి రప్పించారని కేటీర్ గారు గుర్తు చేసారని తెలిపారు .టిఆర్ఎస్ మలేషియా శాఖ అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత మరియు తెలంగాణ ,తెలుగు సంఘాలు సహకారం అందజేస్తున్నాయని తెలిపారు.కేటీర్ గారు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ దృష్టికి తీసుక వెళ్లుతామన్నారని తెలిపారు.
కేటీఆర్‌కు మలేషియా బాధితులపై వినతిపత్రం అందించిన మహేష్ బిగాలా
Related tags :