కుంకుమ పువ్వు ఒక ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. గర్భిణులకు ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును పాలల్లో కలిపి ఇస్తారు. అయితే చాలామంది కుంకుమ పువ్వును గర్భిణులు మాత్రమే వాడాలనే అపోహతో ఉంటారు. కుంకుమ పువ్వు వల్ల లాభాలు అనేకం.కుంకుమపువ్వును తరచూ తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాలల్లో కొన్ని కుంకుమ పువ్వులు వేసుకుని పాలు తాగితే మంచిది. పాలల్లో కుంకుమ పువ్వు వేసినప్పుడు పసుపు రంగులోకి మారితే అది ఒరిజినల్ అని గుర్తు పట్టవచ్చు. -నెలలో కనీసం మూడు లేదా నాలుగుసార్లు కుంకుమ పువ్వు తింటే ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. చాలా రోజులుగా కడుపు ఉబ్బరంగా ఉన్నా ఆ సమస్య కూడా తగ్గుతుంది. అజీర్తి తగ్గించడంలో కుంకుమ పువ్వుది ప్రత్యేక స్థానం.రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో కుంకుమపువ్వు ప్రత్యేకపాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగడం వల్ల గుండెపోటు సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.కుంకుమపువ్వును ఆహారంలో సైతం తీసుకోవచ్చు. అధిక మోతాదులో తినకుండా రోజుకు చిటికెడు తింటే మంచిది. తరచూ ఆహారంలో కుంకుమపువ్వును తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మ సంబంధిత మందుల్లో కూడా కుంకుమపువ్వును విరివిగా వాడుతారు. కుంకుమపువ్వు తింటే లాభం తప్ప నష్టం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
గుండెపోటుకు చెక్ పెట్టే కుంకుమపువ్వు
Related tags :