ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో ఓటర్లు అత్యధికంగా నేరచరితులు, కోటీశ్వరులకే మద్దతు పలికినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.
175 మంది ఎమ్మెల్యేల్లో 103 మందికి 50%పైగా ఓట్లు వచ్చాయి. వీరిలో 62% మంది నేరచరితులు, 60% మంది కోటీశ్వరులు.
2014తో పోలిస్తే 2019లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఓట్ల శాతం 0.67% పెరిగింది. ఈ సంస్థ విశ్లేషణ ప్రకారం ఎమ్మెల్యేలకు దక్కిన ఓట్ల శాతాలివి.
* 103 (59%) మంది ఎమ్మెల్యేలు 50శాతానికిపైగా ఓట్లతో, 71 (41%) మంది ఎమ్మెల్యేలు 41% ఓట్లతో గెలుపొందారు.
* వైకాపా తరఫున గెలుపొందిన 151 మందిలో 53 (36%) మంది 50%లోపు ఓట్లతో గెలుపొందారు. తెదేపా నుంచి గెలిచిన 23 మందిలో 17 (74%)మందికి, జనసేన తరఫున గెలుపొందిన ఒక్కరికి 50శాతంలోపు ఓట్లే వచ్చాయి.
* నేరచరితను వెల్లడించిన 96 మంది ఎమ్మెల్యేల్లో 60 (62%) మంది 50%కిపైగా ఓట్లు పొందారు.
* 163 మంది కోటీశ్వరుల్లో 98 మంది(60%) 50%కిపైగా ఓట్లు పొందారు.
* ఏడుగురు ఎమ్మెల్యేలు రెండు వేల లోపు ఆధిక్యంతో గెలుపొందగా, ముగ్గురు 50%కిపైగా మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
* వైకాపాలో 97 మందికి 50%కిపైగా, 54 మంది 50%లోపు ఓట్లు వచ్చాయి. తెదేపాలో ఆరుగురికి 50%కిపైగా, 17మందికి 50%ఓట్లు దక్కాయి.
ఏపీ ఎమ్మెల్యేల్లో నేరచరితులు వీరే
Related tags :