Sports

ఒలంపిక్స్ స్వర్ణంతో కనపడు

Governor Narasimhan Blesses PV Sindhu For Olympics Gold

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు దేశానికి గర్వకారణమని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌, పారా షట్లర్‌ మానసిలను గవర్నర్‌ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ నిజమైన కృషి, దక్షతకు సింధు నిదర్శనంగా నిలిచిందన్నారు. 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకంతో ఆమె మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని నరసింహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పారా షట్లర్ మానసి జోషి ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక అని గవర్నర్‌ అన్నారు. ఆమె అందరికీ రోల్‌ మోడల్‌ అని కొనియాడారు.