స్టాక్‌మార్కెట్ల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. లోహ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు ఆర్థికమాంద్యం భయాలు కూడా మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా నేటి సూచీలు ఆద్యంతం నష్టాల నావలో సాగాయి. బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమైన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో ఒకదశలో 250 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు కాస్త కోలుకుని 189 పాయింట్ల నష్టంతో 37,452 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,046 వద్ద ముగిసింది. రూపాయి కూడా మరో 25 పైసలు క్షీణించి 71.73గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. యస్‌బ్యాంక్, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత లిమిటెడ్, కోల్‌ఇండియా షేర్లు పతనమయ్యాయి.
250 పాయింట్లు పతనం
Related tags :