Politics

మున్సిపల్ ఎన్నికలను కూడా కొల్లగడతాం

KTR Confident About Muncipal Election Victory In Telangana

మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెరాస విజయం ఏకపక్షమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు ఎంత హడావిడి చేసినా పట్టించుకోవద్దని.. ప్రజలు తెరాస వైపే ఉన్నారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల కోసం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా తెరాసతో పాటు ఇతర పార్టీల బలాబలాలను కేటీఆర్‌ ఆరా తీశారు. మున్సిపాలిటీల పరిధిలో ఇతర పార్టీల్లో బలమైన నేతలు ఎవరున్నారు.. వారి సత్తా ఎంత అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.