ప్రముఖ సబ్‌టైటిలిస్ట్ రేఖ్స్ చేసిన ఆరోపణల్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తిప్పికొట్టింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘2.ఓ’కు ఆమె సబ్‌టైటిల్స్ ఇచ్చారు. కాగా తనకు ఇంకా పూర్తి పారితోషికం ఇవ్వలేదని ఆమె కొన్ని వారాల క్రితం ఆరోపణలు చేశారు. లైకా ప్రొడక్షన్‌కు ఎన్ని ఫోన్లు, మెసేజ్‌లు చేసినా స్పందించడం లేదని ట్వీట్ చేశారు. తన పారితోషికం చెల్లించేందుకు పది నెలల గడువు ఇచ్చానని, అయినా బకాయి ఇవ్వలేదని అన్నారు. ఆమె వ్యాఖ్యల్ని అప్పట్లోనే లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతినిధి ఖండించారు. ఆమెకు ఎప్పుడో పారితోషికం ఇచ్చామని, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సిబ్బంది అగ్రిమెంట్ పత్రాల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ ఆధారాలతో రేఖ్స్ వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. రేఖ్స్ తన పనికి రూ.2 లక్షలు డిమాండ్ చేశారని, కానీ తమ సంస్థ రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. అయినా సరే ఆమె తను అనుకున్న మొత్తం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని పేర్కొంది. ‘మేం నిర్మించిన సినిమా సబ్‌టైటిల్స్‌కు రూ.50 వేల పారితోషికం కేటాయించాం. రేఖ్స్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. దానికి మేం సమ్మతించలేదు. కానీ ఆమె మాత్రం అనుకున్న మొత్తాన్ని మనసులో ఉంచుకుని.. పని పూర్తి చేశారు. మనం పారితోషికం గురించి తర్వాత చర్చించుకుందామని చెప్పి, వెళ్లిపోయారు. ఆపై ఈ విషయమై తరచూ మమ్మల్ని సంప్రదిస్తూ వచ్చారు. కానీ లైకా దానికి ఒప్పుకోలేదు. దీంతో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేశారు. పది రోజుల క్రితం రేఖ్స్‌ను కలిశాం. రూ.లక్ష ఆఫర్ చేశాం. నిజానికి ఇది మా బడ్జెట్ కాదు.. కానీ మా సంస్థ పేరు చెడిపోకూడదని ఇలా చేశాం. అయినా సరే ఆమె రూ.2 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. అది మార్కెట్ ధర కాదు. మేం మా సంస్థపై అనేక సినిమాల్ని తీశాం. ఏ రోజూ మా కోసం పనిచేసిన వారికి పారితోషికం ఇవ్వడంలో ఆసల్యం చేయలేదు, ఎటువంటి తప్పు జరగలేదు. రేఖ్స్‌కు మేం రూ.లక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిర్మాతలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, డబ్బులు పోగు చేసి ఓ సినిమాను నిర్మిస్తారు. ఓ సింపుల్ ట్వీట్, పోస్ట్‌తో ఇతరుల పేరును దెబ్బతీయడం చాలా సులభం. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ మేం విలువ ఇస్తాం. కానీ అర్హతలేని మొత్తాన్ని అడిగితే ఇవ్వడానికి సిద్ధంగాలేం’ అని లైకా పోస్ట్‌లో పేర్కొంది.
అత్యాశ బాగా బలంగా ఉంది
Related tags :