ప్రభాస్-అనుష్క, ప్రభాస్-కాజల్.. తెలుగు వెండితెరపై ఈ జోడీలకున్న క్రేజే వేరు. రెబల్‌స్టార్ ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సినిమాల కోసం అనుష్కతో కలిసి పనిచేశారు. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాల్లో ఆయన సరసన కాజల్ సందడి చేశారు. ‘సాహో’ ప్రచారంలో భాగంగా ప్రభాస్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరి కాజల్, అనుష్క డ్రెస్సింగ్‌పై కామెంట్ చేయమని అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కాజల్ అందంగా ఉంటుంది. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చక్కగా ఉంటుంది’ అని చెప్పారు. అనంతరం ప్రభాస్ స్వీటీ గురించి మాట్లాడుతూ.. ఆమె అందం, రూపాన్ని మెచ్చుకున్నారు. కానీ అనుష్కకు ఫోన్ చేస్తే సమయానికి లిఫ్ట్ చేయదని కంప్లెయింట్ చేశారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘సాహో’ ఆగస్టు 30న విడుదల కాబోతోంది. ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజీత్ దీన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
స్వీటీ తీయదు
Related tags :