చంద్రయాన్-2 ద్వారా భారత్ మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసుకోబోతోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ‘గోల్డెన్ జర్నీ’ పేరిట రూపొందించిన ఫొటో ఆల్బమ్‌ను ఆయన విశాఖలో విడుదల చేశారు. ఎన్‌ఎస్‌టీఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘శాస్త్రవేత్తలందరికీ నా అభినందనలు. న్యూక్లియర్ సబ్ మెరైన్ వృద్ధి చేసుకున్న కొద్ది దేశాల్లో మనం ఉండటం అద్వితీయం. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. మనం ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోం. మన వ్యవహారాల్లోకి వస్తే ఎప్పుడూ చూడని సమాధానం ఇచ్చాం. పొరుగు దేశం ప్రోద్బలం వల్ల వచ్చే ఇబ్బందులను సమర్థంగా తిప్పికొట్టగలం. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనడానికే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంతర్జాతీయ వేదికలపై ఇదే అంశాన్ని స్పష్టంచేస్తున్నారు. దేశమంతా ఒకే స్వరంతో చాటిచెప్పాలి’’ అని అన్నారు.
భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలు
Related tags :