ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్నార్టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉన్న భారత హైకమిషనర్ మిృదుల్ కుమార్‌ను బుధవారం ఏపీ ఎన్నార్పీ బృందం కలిసింది. ఈ సందర్భంగా తాడేపల్లి పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న ఏపీ ఎన్నార్పీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషిచేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ అమలు విషయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అక్కడి భారత హైకమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ఎన్నార్టీ భారత హైకమిషన్, మలేషియా తెలుగు సంఘాలు ఉమ్మడిగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. అక్రమ వలసదారులుగా గుర్తింపబడిన ప్రవాసాంధ్రులకు సహాయం చేయడం, వారు స్వదేశం చేరుకుని తమ సొంత ఇంటికి వెళ్లేవరకయ్యేఖర్చు భరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
మలేషియాను సందర్శించిన ఏపీఎన్నార్టీ బృందం
Related tags :