ఓ పేద పురోహితుడు 30ఏళ్లపాటు పౌరోహిత్యం ద్వారా కూడబెట్టిన రూ.లక్షల సొమ్ము ఆయన చనిపోయాక బయటపడింది. ఈ ఆసక్తికర ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలుగుచూసింది. పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం(70) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయన బంధువులు, పిల్లలు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు కొందరు బంధువులకు సమాచారం ఇచ్చి, బుధవారం మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న పాడుపడ్డ భవనాన్ని పరిశీలించారు. అక్కడ అనేక మూటలు కనిపించడంతో విప్పిచూశారు. వాటిల్లో భారీగా నగదు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. ఎంతకూ తరగకపోవటంతో గణన యంత్రం(కౌంటింగ్ మిషన్)ను తెచ్చి లెక్కించటం మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు రూ.6లక్షలు తేలింది. మరిన్ని మూటల్లోని నగదు లెక్కించాల్సి ఉంది.
ఓ పేద పురోహితుడి నిధి రహస్యాలు ఇవి

Related tags :