చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ 6 కోట్ల రూపాయల వ్యయంతో బంగారు రథం తయారు కు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు..పారదర్శకంగా బంగారు రథం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో తయారు చేస్తున్నట్లుగా వివరించారు.. సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు కన్నుల పండువగా స్వయంభు వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు… సెప్టెంబర్ 2 నుంచి వినాయక చవితి దినం సందర్భంగా 21 రోజులు కానిపాక వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు తో పాటు వివిధ సేవలను అంగరంగ వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు…అదేవిధంగా బ్రహ్మోత్సవా లకు తరలివచ్చే భక్తులు యాత్రికులకు వసతి, తాగునీరు ఏర్పాటుతో పాటు దేవాలయాల పరిశుభ్రతను పాటించాలని కాణిపాక ఈవో మరియు అధికారులకు మంత్రి ఆదేశించారు.
కాణిపాక గణపయ్యకు బంగారు రథం

Related tags :