* బంగారం భగభగ మండుతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాలు బుధవారం మరో శిఖరానికి చేరువయ్యాయి. ప్రాంతీయ ఆభరణాల వర్తకుల నుంచి వచ్చిన కొనుగోళ్ల డిమాండ్, మరోవైపు అంతర్జాతీయ దేశాల ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన పసిడివైపు మళ్లించడంతో దేశవ్యాప్తంగా పుత్తడి రూ.40 వేలకు చేరువైంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.300 అందుకొని రూ.39,970కి చేరుకున్నది. బంగారంతోపాటు వెండి భారీగా పుంజుకున్నది. ఆభరణాల వర్తకులు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర ఏకంగా రూ.2,110 ఎగబాకి రూ.48,850కి చేరుకున్నది. అమెరికా మార్కె ట్లో అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
*రోగుల భద్రతపై ఎనిమిదో అంతర్జాతీయ సదస్సు (ఐపీఎస్సీ) ను హైదరాబాద్లో సెప్టెంబరు 13- 14 తేదీల్లో నిర్వహించడానికి అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిగత శ్రద్ధ, భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ, అంటువ్యాధుల నియంత్రణ, రేడియేషన్… తదితర అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు.
*‘మా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మా జనాభా 15 రెట్లు పెరిగింది, అదే సమయంలో వర్షపాతం 50 శాతం తగ్గింది.
*చైనాలో సవరించిన ఔషధ చట్టం వల్ల భారత జనరిక్ ఔషధాలకు మేలు జరగనుంది. ‘విదేశాల్లో చట్టబద్ధమైన ఔషధాలను కూడా చైనా ఆమోదం లేక ఇప్పటివరకు ఆ దేశంలో నకిలీవిగా పేర్కొంటున్నారు. ఇకపై అలా కాదు.
*‘మిస్టర్ ఫోక్స్ వ్యాగన్’గా సుప్రసిద్ధుడైన ఫెర్డినాండ్ కార్ల్ పీచ్(82) కన్నుమూశారు. దివాలాలో ఉన్న కంపెనీని అంతర్జాతీయ దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.
*జూన్ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సాధించింది.
*జూన్ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సాధించింది. జియో రూ.10,900 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.10,701 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.9809 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.4296 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.408 కోట్లు మాత్రమే సాధించాయి.
* స్వల్ప, మధ్య కాలంలోనే దేశీయంగా సేవలందించే విమానాల సంఖ్య 2,000 కు చేరుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
* దేశీయంగా గిరాకీ పెరుగుతున్న 7 సీట్ల కారును అనంతపురం ప్లాంటులో తయారు చేయడానికి కియా మోటార్ సన్నద్ధమవుతోందని సమాచారం.
*రూ.25 లక్షల కోట్ల స్థాయిలోని నిర్వహణ ఆస్తుల్ని వచ్చే దశాబ్దానికి రూ.100 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ సంఘం (యాంఫీ) వెల్లడించింది.
భగ్గుమన్న బంగారం-వాణిజ్య-08/29

Related tags :