బాలీవుడ్ కథానాయకుడు జాన్ అబ్రహమ్‌తో కాజల్ జోడీ కట్టింది. వారిద్దరూ కలసి ‘ముంబయి సాగా’ అనే చిత్రంలో జంటగా కనిపించ బోతున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సునీల్ షెట్టి, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘షూటవుట్ ఎట్ వడాలా’, ‘షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. 1980, 90 ప్రాంతంలో ముంబయిలో జరిగిన గ్యాంగ్‌వార్‌ల నేపథ్యంలో రూపొందుతోంది. బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో కాజల్ పాల్గొంటోంది. వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
ముంబయి కథలో కాజల్
Related tags :