ఆర్.ఎక్స్ 100’తో తొలి చూపులోనే ఆకట్టుకుంది పాయల్ రాజ్పుత్. ఆ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు అందాయి. దాదాపుగా అన్నీ గ్లామర్ పాత్రలే. ‘ఆర్.డి.ఎక్స్’లో మాత్రం వాటికి విభిన్నంగా కనిపించబోతోంది. తేజస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పాయల్ నాయిక. భాను శంకర్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘సరికొత్త కథా కథనాలతో సాగే చిత్రమిది. పాయల్ పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలి. ప్రేమ, వినోదం, సెంటిమెంట్తో పాటు మరో ఆసక్తికరమైన అంశం కూడా కథలో ఉంది. అదే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. త్వరలోనే టీజర్ని విడుదల చేస్తామ’’న్నారు దర్శక నిర్మాతలు.
పాయల్ బాంబు

Related tags :