ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం నిద్రకే ప్రాధాన్యం ఇస్తాం. డాక్టర్లు కూడా ఈ మధ్య రాత్రి వేళ చపాతీలు తినమనే చెప్పటంతో ఎక్కువమంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే. రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది.శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిలో ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి.గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు కానీ అలా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే మంచిది. అలా చేయలేని వారు చపాతీ తీసుకోవడం ఉత్తమం. చపాతీ కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజూ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
అన్నం బదులు చపాతీలు తింటే ఐరన్ లభిస్తుంది
Related tags :