DailyDose

విశాఖ సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం-తాజావార్తలు-08/29

Vizag Singapore Flight Service Started-Telugu Breaking News Today-08/29

* విశాఖ నుంచి సింగపూర్కు స్కూట్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారంలో ఐదురోజులు ఆది, సోమ, బుధ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు నడుస్తాయి. సింగపూర్లో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి విశాఖకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విశాఖలో రాత్రి 11గంటలకు బయలుదేరి, సింగపూర్ విమానాశ్రయానికి అక్కడి సమయం 5.45 గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీసుల ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రాయితీగా ఒకవైపు రూ.4500 టిక్కెట్ ధరను ప్రవేశపెట్టిందని ఎ.పి.ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరేష్కుమార్, కుమార్రాజా, వర్మలు తెలిపారు.
*సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం వై.యస్‌.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలలని ఆదేశించారు.
* దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ బాడీ స్కానర్లు అమర్చాలని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఎఎస్‌) నిర్ణయించింది. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఏడాదిలోగా వాటిని అమర్చనున్నది. మిగిలిన విమానాశ్రయాల్లో రెండేళ్లలో బాడీ స్కానర్లను అమర్చనున్నట్లు బిసిఎఎస్‌ తెలిపింది.
*జాతీయ క్రీడాదినోత్సవ ఏర్పాట్లలో విశాఖ అధికారుల తీరు విమర్శలకు దారి తీసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తప్పిదాలు నవ్వుల పాల్జేశాయి. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఫొటో ముద్రించిన బ్యానర్‌పై మాజీ అథ్లెట్‌ పీటీ ఉష పేరు రాశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా బీచ్‌రోడ్డులో మంత్రి అవంతి శ్రీనివాస్‌ క్రీడా ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఈ ఫ్లెక్సీ చూసి విస్తుపోయారు. కనీసం నేటితరం క్రీడాకారుల పేర్లు కూడా తెలియదా? అంటూ బహిరంగంగానే చర్చించుకున్నారు.
*పాకిస్తాన్‌ న్యాయ చరిత్రలో అరుదైన సంఘటన జరిగింది. ఒక న్యాయమూర్తికి వాట్సాప్‌లో బదిలీ ఆదేశాలు అందాయి. లాహోర్‌లోని ప్రత్యేక కోర్టులో పిఎంఎల్‌-ఎన్‌ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు రాణా సనౌల్లాపై నమోదైన మాదక ద్రవ్యాల కేసును విచారిస్తున్న సమయంలో వాట్సాప్‌లో న్యాయమూర్తి మసూద్‌కు బదిలీ ఆదేశాలు వచ్చాయి. వెంటనే కేసు విచారణను నిలిపివేసిన న్యామూర్తి న్యాయవాదులతో తనకు వాట్సాప్‌లో బదిలీ ఆదేశాలు అందాయని, తనను లాహోర్‌ హైకోర్టుకు బదిలీ చేశారని చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర అటవీశాఖ నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. దిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జావడేకర్‌ చెక్కును బాలినేనికి అందజేశారు.
* ఏలూరు ఒకటో పట్టణ పరిధిలో ఉన్న సినిమా థియేటర్ల యజమానులతో డిఎస్‌పి దిలీప్‌ గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. డిఎస్‌పి దిలీప్‌ మాట్లాడుతూ.. టికెట్లను అధిక ధరలకు అమ్మకూడదని, బ్లాక్‌ లలో టికెట్లను అమ్మకూడదని చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. ఢిల్లీ లో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర అటవీశాఖ నుండి ఎపికి రావాల్సిన పెండింగ్‌ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
*సముద్రమార్గం గుండా పాకిస్థాన్‌ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడే ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గుజరాత్‌ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌‌, సర్‌ క్రీక్‌ ప్రాంతం నుంచి పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) కమాండోలు లేదా ఉగ్రవాదులు చిన్న చిన్న పడవల ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుజరాత్‌ తీర ప్రాంత సిబ్బందికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. గుజరాత్‌ సహా ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిపి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేస్తున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. భారత నావికాదళానికి చెందిన నౌకలపై దాడులు జరిపేందుకు వీరికి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
* హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు హరియాణాలోని బల్లభ్‌గఢ్‌ వద్దకు రాగానే 9వ నంబరు కోచ్‌ కిందభాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు.
* మిస్టరీ స్పిన్నర్‌గా కొన్నేళ్ల కింద అందరినీ ఆకర్షించిన శ్రీలంక బౌలర్‌ అజంత మెండిస్‌ క్రికెట్‌ వీడ్కోలు పలికాడు. అని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 34 ఏళ్ల మెండిస్‌ లంక తరఫున 19 టెస్టుల్లో 70 వికెట్లు, 87 వన్డేల్లో 152 వికెట్లు, 39 టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు.
* షూటింగ్‌ ప్రపంచకప్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత షూటర్లు ఎలావెనిల్‌ వలారివన్‌, అంజుమ్‌ మౌద్గిల్‌లు ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. క్వాలిఫికేషన్‌లో ఎలావెనిల్‌ 629.4 పాయింట్లు, అంజుమ్‌ 629.1 పాయింట్లు స్కోర్‌ చేశారు. అంజుమ్‌ ఇంతకుముందే ఒలింపిక్‌ కోటా స్థానం సాధించింది. ఇప్పుడు ఆమె దృష్టంతా పతకంపై మాత్రమే.
*ప్రభుత్వ లేఖలు తెలుగులోనే సాగేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఆలోచిస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్య గ్రంథాలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
* ఆన్లైన్ ద్వారా రాయితీ విత్తనాలను విక్రయించే విధానాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర వ్యవసాయశాఖకు జాతీయస్థాయి స్కోచ్ పురస్కారం దక్కింది.
*రెండేళ్ల కిందట కేరళను ముంచెత్తిన వరదల్లో అతలాకుతలమైన అలెప్పి ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణకు విశేషంగా కృషి చేసిన సబ్ కలెక్టర్ వి.ఆర్.కృష్ణతేజకు కేరళ ప్రభుత్వ పురస్కారం లభించింది.
*ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరే సొమ్ము వారి పాత అప్పులకు జమకాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ‘స్పందన’ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన దృశ్యశ్రవణ సమీక్ష నిర్వహించారు.
*పంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ఇన్నాళ్లకు నిరీక్షణ ఫలించింది. 2 కాంస్యాలు.. 2 రజతాలు.. చివరికి స్వర్ణం సాధించా. గర్వంగా అనిపించింది. మనసు తేలికగా ఉందిప్పుడు. కోచ్లు గోపీ సర్, కిమ్ల సహకారంతోనే ఈ పతకం సాధ్యమైంది.
*తెలంగాణలో ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, నిధుల వినియోగం సహా అన్ని దశల్లోనూ నిధుల వ్యయంలో ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు.
*శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఒకటి లేదా రెండు దఫాల్లో దసరా నాటికి దీనిని చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి దఫా దసరా లోపు కాగా.. రెండో విడత సంక్రాంతి నాటికి చేపట్టవచ్చని తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్ సమావేశాలున్నాయి.
*కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు ముసాయిదా తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం హన్మకొండలో కార్యశాల నిర్వహించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నానికే వారంతా హన్మకొండకు చేరుకున్నారు.
*ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలని హైదరాబాద్ యువత తహతహలాడుతోంది. దేశవ్యాప్తంగా సర్కారు కొలువుల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు మన నగరం నుంచే అత్యధిక దరఖాస్తులు అందుతున్నాయి.
*గ్రామ రెవెన్యూ వ్యవస్థ ముఖచిత్రం మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఏ స్థాయి నుంచి మార్పులు చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంగళవారం వరంగల్లో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లు గ్రామ రెవెన్యూ వ్యవస్థ సమూల మార్పులపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.
*ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలని హైదరాబాద్ యువత తహతహలాడుతోంది. దేశవ్యాప్తంగా సర్కారు కొలువుల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు మన నగరం నుంచే అత్యధిక దరఖాస్తులు అందుతున్నాయి.
*అయిదేళ్లలో దేశం అబ్బురపడేలా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, బహుళార్థ సార్థక ప్రాజెక్టులను చేపట్టిందని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు పేర్కొన్నారు.
*మున్సిపల్ వార్డుల విభజన ప్రక్రియలో చట్టసభల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.
*బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్పై 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది.
*డిగ్రీ కళాశాలల్లో చేరిన వారు కోర్సు, మాధ్యమాలను మార్చుకోవడానికి ఈనెల 29 నుంచి 30వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్ (కళాశాలలో) స్లైడింగ్ కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ఈనెల 31న కేటాయింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
*అటవీ కళాశాల-పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ)లో వచ్చే ఏడాది నుంచి ఎమ్మెస్సీ ఫారెస్ట్ కోర్సును ప్రవేశపెట్టాలని పాలక మండలి తీర్మానించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది.
*రహదారి మరమ్మతులకు నిధుల విషయమై ఓ ప్రజాప్రతినిధి, ఎంపీడీవో మధ్య జరిగిన ఫోన్ సంభాషణ.. అందులో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై ఆ అధికారి చేసిన వ్యాఖ్యలు ఆయన సస్పెన్షన్కు దారితీశాయి.