* అవగాహన లేని దుర్మార్గపు వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో జగన్ పాలన ప్రారంభించారన్నారు. వరద కష్టాల్లో ప్రజలుంటే జగనేమో విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు. ఒక్క అవకాశం ఇద్దామనుకున్న ప్రజల నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీలతో కమిషన్ కుదరకపోవటంతోనే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం కొత్త నాటకం మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు. ఇసుక టెండర్ల పేరుతో వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.ఇసుక కొరత వ 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా 900 కోట్లు ఆదాయం వచ్చేదన్నారు. అయినా చంద్రబాబు మాత్రం ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రెండు వేలు ఉంటే.. ఇప్పుడేమో 10 వేలు అయిందన్నారు. మిగతా 8 వే ఏ పంది కొక్కులు తింటున్నాయని ఫైరయ్యారు. పోలవరంపై కోర్టు మందలించినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందన్నారు. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా చెప్పుకొచ్చారు. రాజధానిలో టీడీపీ నేతలకు భూములున్నాయని ఆరోపించడం కాదన్నారు. ప్రభుత్వంలో ఉండి గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒకవేళ టీడీపీ నేతలకు భూములుంటే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
*ఏపీ అకాడమీ అందువల్లే కుదేలైంది
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు ఇసుక కొరతను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. 20 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
* సెప్టెంబర్ 14 నుంచి అసెంబ్లీ?
అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 (శనివారం) నుంచి సభా సమావేశాలను ప్రారంభించేందుకు సీఎం ఓకే చెప్పినట్టు సమాచారం. మొదటి రోజే బడ్జెట్ను పెట్టేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బడ్జెట్ సమీక్ష సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. సెప్టెంబర్ 4, 9, 14వ తేదీలు సభను ప్రారంభించేందుకు అనువుగా ఉన్నాయని అసెంబ్లీ సెక్రటరీ సూచించారు. దీంతో 14వ తేదీకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు బడ్జెట్ పెట్టాక తర్వాతి రోజు ఆదివారం సెలవు ఇస్తారని, సోమవారం నుంచి వారం పాటు నాన్స్టాప్గా సమావేశాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు. బడ్జెట్పై చర్చతోపాటు మున్సిపల్ ఆర్డినెన్స్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. జులై 18, 19వ తేదీల్లో మున్సిపల్ బిల్లు కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బిల్లుపై గవర్నర్ అభ్యంతరం చెప్పడంతో దాన్ని పక్కనపెట్టేసి ఆర్డినెన్స్ తెచ్చారు. దీంతో ఆ ఆర్డినెన్స్ను ఈ సమావేశాల్లో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
* సెప్టెంబర్ 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటిబ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయా విభాగాల ముఖ్యకార్యదర్శులు, సీఎం కార్యాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, కార్యదర్శులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభం, అమలుపై సమీక్షించి మంత్రివర్గం ఆమోదించనుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లకు ఆమోదంపై చర్చించే అవకాశం ఉంది. రాజధానిలో అభివృద్ధి పనులు చేపట్టే అంశాలపై, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.
* 27న ఐరాసలో ప్రధాని మోడీ ప్రసంగం
ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు గురువారంనాడు వెల్లడించాయి. ఈ సమావేశంలో మోడీ వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27న రాత్రి 7:30 గంటలకు మోడీ ప్రసంగించనున్నారని ఐరాస విడుదల చేసిన ప్రాథమిక జాబితా ద్వారా తెలుస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అదేరోజు అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఉంది. సమావేశం నుంచి కొందరు నాయకులు తప్పుకుంటే ఇమ్రాన్ ఖాన్‌కు నిర్ణీత సమయం కన్నా ముందే మాట్లాడే అవకాశం లభిస్తుంది.
*మా నాయకుడు కేసీఆరే
హుజురాబాద్లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని కొన్ని ప్రసార, సామాజిక మాద్యమాలు వక్రీకరించడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాను గులాబీ సైనికుడినని, తమ నాయకుడు సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. తనపై నిరాధార ప్రచారం ఆపాలని, సామాజిక మాధ్యమాలు సంయమనం పాటించాలని అన్నారు, హుజురాబాద్లో ఆయన చేసిన ప్రసంగంపై ఈ మేరకు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు
*ప్రజల సెంటిమెంట్తో రూ.వేల కోట్ల అవినీతి
తెలంగాణ ప్రజల కరెంటు సెంటిమెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు ప్రభాకర్రావు, రఘుమారెడ్డిలకు అత్యంత కీలకమైన విద్యుత్శాఖ బాధ్యతలు అప్పగించి, వారితో తప్పుడు ఒప్పందాలపై సంతకాలు చేయించి రూ.వేల కోట్ల అవినీతికి ఆస్కారం కల్పించారన్నారు. కేసీఆర్ అవినీతి మీద అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం.. విచారణ జరిపించడానికి భాజపా నాయకులు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు.
*తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలి: జీవన్రెడ్డి
మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి మొగ్గు చూపకుండా.. తుమ్మిటిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం కమీషన్ల కోసమే మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కలెక్టర్లు తుమ్మిడిహట్టిని కూడా సందర్శించాలని, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. వినోద్కుమార్ తెరాస నాయకుడిగా కాకుండా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
*రైతుల అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలి
రైతుల అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, టీపీసీసీ కిసాన్సెల్ ఛైర్మన్ అన్వేష్రెడ్డిలతో కలిసి ఆయన గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నల్లబజారులో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్నారు.
*సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ప్రజాస్వామ్యవాదులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ (మావోయిస్టు) పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. తెరాస ప్రభుత్వం, కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు, పౌరహక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పేరుతో గురువారం ఒక ప్రకటన విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలతో కుమ్మక్కై అటవీ సంపదను దోచుకునేందుకు ఆదివాసీలను గెంటివేస్తున్నారని విమర్శించారు.
*రహదారి పనుల్లో వేగం పెంచండి-కేంద్ర మంత్రికి తెరాస బృందం వినతి
కేంద్రప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు వేగవంతం కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెరాస ప్రతినిధుల బృందం కోరింది. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిందే, జాజుల సురేందర్ దిల్లీలో ఆయనను కలుసుకున్నారు. రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను గుర్తించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 1,388 కి.మీ.నే గుర్తించారన్నారు. మిగతా రహదారుల పనులనూ వెంటనే ప్రారంభించాలని వారు విన్నవించారు.
*పాక్ నివేదికలో భాజపా నేతల పేర్లు కూడా..
జమ్మూ-కశ్మీర్లోని పరిస్థితిపై ఐక్య రాజ్య సమితికి పాకిస్థాన్ సమర్పించిన వినతిపత్రంలో భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ఉటంకించింది. అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యతో పాటు, భాజపా నాయకులు చేసిన వ్యాఖ్యానాలను ప్రస్తావించింది. భాజపా నేత, హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీల వ్యాఖ్యలను పేర్కొంది. భాజపాకు చెందిన ముస్లిం కార్యకర్తలు కశ్మీరీ మహిళలను పెళ్లి చేసుకోవచ్చని సైనీ అన్నారని, ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యే చేశారని వివరించింది.
*ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు అవాస్తవం
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలపై రాజ్యసభ సభ్యులు, భాజపా నాయకుడు సుజనాచౌదరి స్పందించారు. తన ఆస్తులు, అప్పుల విషయంలో స్పష్టత ఇస్తూ..వాటికి సంబంధించిన పత్రాలను మీడియా ముందుంచారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న బొత్స ఆరోపణలను ఖండించారు. 1913 నుంచి 2013 వరకు తమకు తాతల కాలం నుంచి 215 ఎకరాలు ఉన్నాయన్నారు. 2013 తరువాత తాను గాని, తన కుటుంబ సభ్యుల పేరుమీద గాని ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో సెంటు భూమి కొనలేదని స్పష్టం చేశారు.
*అమరావతే ఉండాలి -ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని, దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టత ఇవ్వాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్నభవన్లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టు బెంచ్లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పలు భవనాల దశలను ఆయన వివరించారు.
*తప్పుడు ఆరోపణలతో క్షోభ పెట్టొద్దు: కోడెల
ఈనాడు, అమరావతి: తప్పుడు ఆరోపణలతో తనను క్షోభ పెట్టొద్దని శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కోరారు. గుంటూరులో ఆయన మీడియాకు గురువారం ఒక లేఖ విడుదల చేశారు. ‘37 ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాలు చేశా. తప్పుడు ఆరోపణలు చేస్తూ క్షోభ పెట్టవద్దని కోరుతున్నా’ అని కోడెల లేఖలో పేర్కొన్నారు.
*మారిస్తే ఊరుకోం: దేవినేని అవినాష్
రాజధాని అమరావతిని ప్రజాభిప్రాయంతోనే నిర్ణయించారని, 25వేల మంది రైతులు భూములు ఇచ్చారని..రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. అమరావతిలో ఇప్పటి వరకు జరిగిన పనులను గురువారం తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మందడంలో విలేకరులతో మాట్లాడారు. పలువురు రైతులతో చర్చించారు. సేవ్ అమరావతి పేరుతో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని శ్రావణ్కుమార్ అన్నారు.
*తెదేపాకు వరుపుల రాజా రాజీనామా
తెదేపా రాష్ట్ర కార్యదర్శి, తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వరుపుల రాజా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం విజయవాడలో మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కేటాయించడంలో పార్టీ అధిష్ఠానం జాప్యం చేయడమే తన ఓటమికి కారణమని ఆరోపించారు. పార్టీ పటిష్ఠతకు అహర్నిశలు శ్రమించిన కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
జగన్ పై అచ్చెన్న మండిపాటు-రాజకీయ–08/30
Related tags :