కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.
గత 9 రోజులుగా సిబిఐ కస్టడీలోనే ఉన్న చిదంబరంకు మరో 4 రోజులు కస్టడీ పొడిగించారు.
అయితే ఇదే కేసులో ఇడి అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట లభించింది.
దీనిపై ఇడి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం సెప్టెంబరు 5న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
అప్పటివరకు చిదంబరంను ఇడి అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణను పొడిగించింది.
దేశవ్యాప్తంగా సిబిఐ ఏకకాలంలో దాడులను నిర్వహించింది. మొత్తం 150 ప్రాంతాలలో సిబిఐ బృందాలు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలలో భారీగా వస్తున్న అవినీతి ఆరోపణల దృష్ట్యా ఈ దాడులు చేసినట్లుగా సిబిఐ తెలపగా రైల్వే, మైనింగ్, కస్టమ్స్ కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు.