క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ గల్లీ క్రికెట్ ఆడారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సచిన్ షూటింగ్ గ్యాప్‌లో స్టార్స్‌తో కలిసి క్రికెట్ ఆడాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్‌కి వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్ బౌలింగ్ చేశారు.
ఆ తర్వాత సచిన్.. మహిళా యువ క్రికెటర్‌తో వరుణ్‌కి బౌలింగ్ చేయించాడు. ఆ తర్వాత తను బౌలింగ్ చేశాడు.
ఈ గల్లీ క్రికెట్‌కి సంబంధించిన వీడియోని సచిన్ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ పనిలో ఆటలని భాగం చేసుకోవాలని సూచించాడు.
జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికాడు.