పాపులర్ బుల్లితెర నటి నళిని నేగిపై ఆమె రూమ్మేట్ దాడి చేసి, దారుణంగా చితకబాదారు. ఈ మేరకు నళిని ముంబయిలోని ఓషివారా పోలీసు స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రూమ్ మేట్ ప్రీతి, ఆమె తల్లి స్నేహలత కలిసి తన ముఖాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు వస్తున్నారని, గదిని ఖాళీ చేయమని వారిని నటి అడగడంతో తనపై దాడికి దిగారని చెప్పారు. కొన్నేళ్ల క్రితం నళిని.. ప్రీతితో కలిసి ఫ్లాట్‌లో ఉండేవారు. ఆ తర్వాత నటి మరో ఇంటికి మారిపోయి, ఒంటరిగా నివసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రీతి మళ్లీ నళినిని కలిశారు. ఇల్లు దొరకడం లేదని, కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని అడిగారు. దీనికి నళిని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నళిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతి నా ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే ఆమె తల్లి స్నేహలత కూడా వచ్చారు. రూమ్ షిఫ్టింగ్‌కు సహాయం చేయడానికి వచ్చారేమో అనుకున్నాను. కొన్ని రోజులకు మా అమ్మానాన్న వస్తున్నారని, రూమ్ ఖాళీ చేయమని అడిగా. గత వారం స్నేహలత నాతో కారణం లేకుండా వాదించింది. మీ సమస్య ఏంటని అడిగాను. కానీ ఆమె కారణం చెప్పకుండా అసభ్యంగా మాట్లాడారు. ప్రీతీని పిలిచి.. నేను తనను గౌరవించడం లేదని చెప్పారు. ప్రీతీ కూడా నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. నేను వివరణ ఇచ్చేలోపు.. వెంటనే వాళ్ల అమ్మ గ్లాసుతో నాపై దాడి చేసింది. నేను స్పృహ కోల్పోయా. ఇద్దరు నామీదపడి దారుణంగా కొట్టారు. దాదాపు నన్ను చంపేందుకు ప్రయత్నించారు. నేను నటిని కావడంతో నా ముఖాన్ని నాశనం చేయాలని వాళ్లు అనుకున్నారు. నా తల్లిదండ్రులు ప్రస్తుతం నా బాగోగులు చూసుకుంటున్నారు’ అని చెప్పారు.
నటిపై గాజుగ్లాసుతో దారుణంగా దాడి
Related tags :