‘ఒక ఖాన్ సినిమా కోసం మరో ఖాన్కు నో చెప్పింది.. ఇప్పుడేమో రెండు చిత్రాలూ చేజారాయి’ అంటూ ఆలియా భట్పై బాలీవుడ్ వర్గాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. విషయమేంటంటే సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే ‘ఇన్షా అల్లా’లో ఆలియా నాయికగా ఎంపికైంది. సల్మాన్తో అవకాశం వచ్చినందుకు ఎంతో మురిసిపోయింది. వెంటనే అడిగినన్ని కాల్షీట్లు ఇచ్చేసింది. అదే సమయంలో ఆమీర్ ఖాన్ నటించే మరో చిత్రం కోసమూ ఆలియాను సంప్రదించారని, కానీ కాల్షీట్ల సమస్యతో నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఆమీర్ చిత్రం కన్నా ‘ఇన్షా అల్లా’ భారీ బడ్జెట్ చిత్రం కావడం వల్లే ఆలియా దానికే ఓకే చెప్పిందని చెప్పుకున్నారు. కానీ ఆలియా దురదృష్టం… సెట్స్ పైకి వెళ్లక ముందే ‘ఇన్షా అల్లా’పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఇప్పట్లో లేదని, దాని గురించి తర్వాత వెల్లడిస్తామని అటు భన్సాలీ, ఇటు సల్మాన్ ఇటీవలే ప్రకటించారు. దీంతో ‘ఇన్షా అల్లా’ ఆగిపోయినట్లే అని గట్టిగా వినిపిస్తోంది. దీంతో సల్మాన్, ఆమీర్.. ఈ ఇద్దరి చిత్రాలనూ ఆలియా పోగొట్టుకుందని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆలియా ఏం చేయబోతోందంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ‘ఇన్షా అల్లా’కు ఇచ్చిన కాల్షీట్లను ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కేటాయించిందంటూ వార్తలు వస్తున్నాయి.
రెంటికీ చెడ్డ రేగడి
Related tags :