DailyDose

భారీ అగ్ని ప్రమాదం ఎనిమిది మంది మృతి-నేరవార్తలు-08/31

భారీ అగ్ని ప్రమాదం ఎనిమిది మంది మృతి-నేరవార్తలు-08/31

*మహారాష్ట్రలోని ధూలేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో 12 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. మరో 58 మందికి గాయాలయ్యాయి.
* ఓ యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తనపై కేసు నమోదయిందన్న భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎర్రగడ్డ నేతాజీనగర్‌లో చోటుచేసుకుంది. ఉరి వేసుకుని సాయి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
*బైక్‌ ను లారీ ఢీకొన‌డంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శనివారం సిద్ధాంతం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సిద్ధాంతం జాతీయ రహదారిపై బైక్‌ పై వెళుతున్న ఇద్దరు యువకులను, లారీ ఢకొీంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల మరణంతో పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*తుళ్లూరు మండలం మందడం సమీపంలో గల సీడ్ ఎక్సిస్ రోడ్డు వద్ద కారు ప్రమాదం ఉదయం సమయంలో సుమారు 100 నుండి 110 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కంకరు కుప్పను ఢీకొనడంతో తలక్రిందులు ఆయన వాహనం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తుల కు తీవ్రం గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.మృతుడు ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన చెన్నూరు రాజగోపాల్(49)మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు.
* ఓ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో పోస్కో ప్రత్యేక కోర్టు విచారణను కేవలం 9 రోజుల్లోనే ముగించి సంచలన తీర్పు వెలువరించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది.
* రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్‌శాఖలో నిజాయితీగా పనిచేసినందుకు నాపై అక్రమంగా ఏసీబీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అధికారులను నిలదీస్తే జమ్మికుంట నుంచి పోస్టింగ్ తీసివేశారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ని కలిస్తే హుస్నాబాద్‌కు పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
*పలమనేరులో దొంగల స్వైర విహారం చేశారు. మూడు షాపులు, ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల్లోకి దుండగులు చొరబడ్డారు. రెండు దుకాణాల్లో భారీగా చోరీకి పాల్పడ్డారు. మరో రెండు చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు…
*కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట సమ్మయ్య, సైదల పెద్ద లింగయ్యలు పొలంలో మందు చల్లడానికి వెళ్లారు. వర్షం పడటంతో చెట్టుకింద నిల్చున్నారు. వారు నిల్చున్న చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు ఇద్దరికి రైతు బీమా వర్తిస్తుందని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు…
*గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని వస్త్రాల ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. సూరత్ నగరంలోని పందేసర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చారు. 18 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ అగ్నిప్రమాదంలో ఆస్తినష్టం పెద్దఎత్తున జరిగింది…
*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ మానేరుకు 30 వేల క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడంతో.. వరద ఉద్ధృతిలో 1000 గొర్రెలు, మేకలు గల్లంతయ్యాయి. 13 మంది గొర్రెల కాపర్లు కూడా వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. పలు ద్విచక్రవాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అయితే పలువురు కాపర్లు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకుచేరుకున్నారు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మిగతావారిని కూడా రక్షించారు.
* వేగంగా వస్తున్న బస్సు మురుగుకాల్వలో పడి 24 మంది ప్రయాణికులు మరణించిన ఘటన పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఖైబర్ ఫక్తూన్‌ఖవా అప్పర్ కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. పాకిస్థాన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీశారు…
* విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని హుండాయ్ కార్ల షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మాటలు ఎగసిపడుతుండగా కొత్త కార్లు తగలబడిపోతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
* బీహార్‌‌‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌‌ ఉద్యోగులకు డ్రస్‌‌ కోడ్‌‌ పెట్టింది. ఆఫీస్‌‌కు వచ్చేటప్పుడు జీన్స్‌‌, టీషర్ట్స్‌‌ వేసుకోవద్దని, ఫార్మల్‌‌ డ్రస్సుల్లో ఆఫీస్‌‌కు రావాలని ఆర్డర్స్‌‌ పాస్‌‌ చేశారు. “ చాలా మంది ఉద్యోగులు ఆఫీస్‌‌ కల్చర్‌‌‌‌కు విరుద్ధంగా జీన్స్‌‌, టీషర్ట్స్‌‌తో ఆఫీస్‌‌కు వస్తున్నారు. ఎంప్లాయిస్‌‌ అంతా డీసెంట్‌‌గా, సింపుల్‌‌గా కనిపించే దుస్తులు వేసుకోవాలి” అని ఆర్డర్‌‌‌‌ ఇష్యూ చేశారు.
* సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌‌పై మరో ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఫైలైంది. 2016 అక్టోబర్‌‌‌‌లో ఆజంఖాన్‌‌, ఆయన అనుచరులు తమ ఇంట్లోకి చొరబడి బర్రెను, రూ.25వేలు నగదును ఎత్తుకెళ్లారని రామ్‌‌పూర్‌‌‌‌కు చెందిన అసీఫ్‌‌, జకీర్‌‌‌‌లు ఆయనపై కేసు పెట్టారు. స్కూల్‌‌ బిల్డింగ్‌‌ కట్టేందుకు తాము ఉంటున్న ఇంటిని, ల్యాండ్‌‌ను రాసివ్వాలని బెదిరించారని ఆరోపించారు. దీనిపై అప్పటి సర్కిల్‌‌ ఆఫీసర్‌‌‌‌ హసన్‌‌, మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే చాలా కేసుల్లో నిందితుడైన ఆజం ఖాన్‌‌కు కోర్టు నాన్‌‌ బెయిలబుల్‌‌ వారెంటు జారీ చేసింది.
* మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు లింగయ్య, సమ్మయ్య మృతి చెందారు. నిన్న పొలం పనులకు వెళ్లిన లింగయ్య, సమ్యయ్య మృతదేహాలు తెల్లవారుజామున ఓ చెట్టుకింద లభ్యమైయ్యాయి.
*ఆదిలాబాద్ జిల్లాలో బసవన్నల పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బసవన్నలను శుభ్ర పరిచి ప్రత్యేకంగా రంగు రంగులతో అలంకరించి, గ్రామంలో ఊరేగించి హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, కుమరం భీం జిల్లా బెజ్జూరు మండలం కుకుడలో రైతు సేగం పుల్లయ్య(50) చెరువులో ఎద్దులను కడుగుతూ నీటిలో మునిగి చనిపోయాడు.
*నరసరావుపేట పోలీసులు నమోదు చేసిన పలు కేసుల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది.
*భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానాంద్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేసి, అదృశ్యమైన న్యాయవిద్య విద్యార్థిని… నాటకీయ పరిణామాల మధ్య సుప్రీంకోర్టుకు హాజరైంది.
*ఓ యువకుడి వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన గురువారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
*విశాఖలోని కార్ల సర్వీసు కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖ నగరంలోని ఎంవీపీకాలనీ డబుల్రోడ్డు చివరన హుందాయ్ కంపెనీకి చెందిన మ్యాంగో హుందాయ్ కార్ల సర్వీస్ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
*ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో అదృశ్యమైన న్యాయ విద్యార్థిని (23) క్షేమంగానే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
*ఓ నటుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే వింతగా ప్రవర్తిస్తూ.. వాహనాన్ని ధ్వంసం చేశాడు. చివరికి స్థానికులచేత తన్నులు తిన్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొడగులో చోటుచేసుకుంది.
* ఆయనో మాజీ పోలీస్ కానిస్టేబుల్. ఆయన సతీమణి స్వగ్రామంలో సర్పంచిగా పనిచేశారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అయినా ఆయన మాత్రం అడ్డదారిని ఎంచుకొన్నాడు. ఇళ్లలో చోరీలు చేస్తూ దొంగగా ముద్ర వేసుకున్నాడు.
*గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల గ్రామంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కీర్తన (17) గురువారం మధ్యాహ్నం స్పృహతప్పి పడిపోయింది.