వినాయకుడి విగ్రహాలను వినూత్న పద్ధతుల్లో, వెరైటీగా తయారు చేస్తుంటారు. కొందరు కూరగాయలతో, మరికొందరు కరెన్సీ నోట్లతో, ఇంకొందరు ఇతర వస్తువులతో గణేశ్ ప్రతిమలను తయారు చేసి చూపరులను ఆకట్టుకునేలా చేస్తుంటారు. అయితే కర్ణాటకలోని ఉడుపికి చెందిన మణిపాల్ శాండ్ హార్ట్ టీమ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు.. 21 దేశాలకు చెందిన కృత్రిమ కరెన్సీతో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం పొడవు 12 ఫీట్లు. పెద్ద మొత్తంలో ఇండియా కరెన్సీని ఉపయోగించారు. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, ఆప్ఘనిస్థాన్, భూటాన్, యూఏఈ, యూఎస్, ఇజ్రాయెల్‌తో పాటు పలు దేశాల కరెన్సీని ఉపయోగించి గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కరెన్సీ విగ్రహాన్ని శ్రీనాథ్ మణిపాల్, వెంకీ పాలిమర్, రవి హిరేబెట్టు రూపొందించారు. అయితే ఈ వినాయకుడికి విశ్వ ధనదీప గణేశగా నామకరణం చేశారు. గతంలో పేపర్, చేనేత వస్తువులు, బిస్కెట్లు, గింజలతో గణేశ్ ప్రతిమలను తయారు చేశారు వీరు.
21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక విగ్రహం
Related tags :