ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తీస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ట్వీట్లు చేసింది. నిజంగా నూతన నటులు కావాలంటే తన బృందం నేరుగా అధికారిక మాధ్యమం ద్వారా సంప్రదిస్తుందని పేర్కొంది. ‘కొంతమంది అపరిచితులు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ఖాతాలు నడుపుతూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు క్యాస్టింగ్ కాల్స్ అంటూ ఫేక్ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత క్యాస్టింగ్ కాల్స్ గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మేం హెచ్చరిస్తున్నాం. మా ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా నేరుగా మా ‘ఆర్.ఆర్.ఆర్’ అధికారిక మాధ్యమం ద్వారానే ప్రకటిస్తాం’ అని పోస్ట్‌లు చేశారు.
రాజమౌళి పేరు క్రెడిట్ కార్డులా వాడేసుకుంటున్నారు
Related tags :