ScienceAndTech

స్వీడన్‌లో కరెన్సీ నోట్లు ఆపేస్తారు

Sweden To Cancel Currency Notes. Will go digital only.

ప్రపంచంలోనే మొదటిగా స్వీడన్‌లో 2023 కంతా డబ్బు చలామణిని నిషేధించబోతున్నారు. ఇప్పటికే అక్కడి 95 శాతం మంది డిజిటల్‌ లావాదేవీలకి అలవాటుపడిపోయారట!
* మొసలి అనగానే… భయపడిపోతాం కానీ మనదేశ నదుల్లో ఉండే ఘరియల్‌ మొసళ్లు చేపల్ని తప్ప వేటినీ తినవు. వాటి నోరు అంతకన్నా పెద్దగా తెరుచుకోదు!
* లియొనార్డో డావించీ గీసిన ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా చిత్రం… చాలాకాలంపాటు ఫ్రాన్స్‌ మహావీరుడు నెపోలియన్‌ పడగ్గదిలో ఉండేది!
* మనదేశంలో తొలి టీవీ కమర్షియల్‌ యాడ్‌ గ్వాలియర్‌ సూటింగ్స్‌కి సంబంధించింది. ‘లైక్‌ ది వార్మ్‌త్‌ ఇన్‌ యువర్‌ హ్యాండ్స్‌’ (మీ చేతుల్లోని వెచ్చదనం లాంటిది!) అనే దాని నినాదం 1970-80ల్లో బాగా పాపులర్‌!
* ఇప్పటిదాకా చందమామపైన అడుగుపెట్టిన వాళ్ల సంఖ్య… 24.
* ప్రపంచయుద్ధంలో సైనికులుగా పాల్గొన్న అమ్మాయిలు ప్యాంట్లు వాడటం కారణంగానే… పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్లందరూ స్వేచ్ఛగా వాటిని ధరించి బయటకి రావడం మొదలైంది!
* 19వ శతాబ్దం నుంచి 1966 దాకా ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, యూఈఏ, ఒమన్‌… ఈ దేశాల్లో భారత రూపాయలే చలామణిలో ఉండేవి.
* భారత జాతీయ పక్షి నెమలి కదా… నేపాల్‌ జాతీయపక్షి మోనల్‌, జపాన్‌ జాతీయ పక్షి కిజి, థాయ్‌లాండ్‌-సియామీన్‌ థైర్‌బ్యార్‌, బర్మా-నల్ల కోడి, శ్రీలంక-పుంజు… ఇవన్నీ కూడా నెమలి జాతికి చెందినవే!
* పాము కళ్ళకు రెప్పలుండవు. ఒంటెలకు మూడు కనురెప్పలు ఉంటాయి.
* తల్లి గర్భంలో బిడ్డ ఎదిగే సమయం… మానవుల్లో తొమ్మిది నెలలు కదా, ఏనుగుల్లో అది 22 నెలలు.
* మేకల కనుపాపలు గుండ్రంగా కాక దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.
* 20వ శతాబ్దం దాకా కేరళ రాష్ట్ర అధికారభాష… తమిళమే! 16వ శతాబ్దం వరకు కూడా మలయాళానికంటూ అధికారిక లిపి లేదు.