పదోతరగతి చదువుతున్న బాలుడిపై మరో ముగ్గురు ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన చాంద్రాయణగుట్టలోని ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వెలుగు చూసింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటపడింది. భవానీనగర్ ఠాణా పరిధిలో నివసించే ఓ బాలుడు గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అతడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టారు. ఇటీవల బాధితుడి తండ్రి పాఠశాలకు రాగా అతడు నీరసంగా కనిపించాడు. ఏమిటని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. వెంటనే తండ్రి శుక్రవారం చాంద్రాయణగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పదోతరగతి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థుల అత్యాచారం
Related tags :