విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. జిల్లా టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు సభ్యత్వం స్వీకరించారు. విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అడారి ఆనంద్‌కుమార్, యలమంచిలి మున్సిపాలిటీ మాజీ ఛైర్‌పర్సన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి, విశాఖ డెయిరీ డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, మలసాల వెంకటరమణ, అరంగి రమణబాబు, శీరంరెడ్డి సూర్యనారాయణ, శీరంరెడ్డి సూర్యనారాయణ (ఒకే పేరుతో ఇద్దరు), కోళ్ల కాటమయ్య, గేదెల సత్యనారాయణ, సేనాపతి గౌరీ భీమ శంకరరావు, దాడి గంగరాజు, చిటికెల రాజకుమారి, సుందరపు ఈశ్వర పరదేశ్ గంగాధర్, శరగడం వరహ వెంకట శంకరరావు ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ స్వయంగా కండువాలు కప్పిన పార్టీ అధ్యక్షుడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాజీ ఛైర్మన్ దొండా కన్నాబాబు, సెంట్రల్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పినపోలు వెంకటేశ్వరరావు, జిల్లా కాపు సంఘం నాయకులు కాజ వెంకట అప్పారావు, యలమంచిలి మాజీ ఎంపీపీ అడారి శ్రీధర్, ఆర్.ఈ.సి.ఎస్. మాజీ అధ్యక్షుడు బి.ప్రసాద్, సీనియర్ లీడర్ బొడ్డేట ప్రసాద్, మునగపాక మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు ప్రభుత్వం మొదటి మూడు నెల్లలోనే ఎన్నో నిర్ణయాలు తీసుకుందని, ఈ క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం వారికి మార్గనిర్దేశం చేశారు. త్వరలో ఏర్పాటవుతున్న గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు చాలా మంచి జరుగుతుందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల పట్ల పాలకుల్లా కాకుండా సేవకుల్లా ఉండాలని సీఎం సూచించారు.
విశాఖ తెదేపాకు భారీ షాక్
Related tags :