పెంపుడు కోడి ఓ వృద్ధ మహిళ ప్రాణాలను బలిగొన్న ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కోడి వద్ద నుంచి గుడ్లు తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మహిళ కోడి గుడ్లు తీస్తున్న క్రమంలో కోడి పుంజు ఆమెపై దాడి చేసింది. అప్పటికే కోపంతో ఉన్న కోడి.. తన పదునైన ముక్కుతో ఆమెను గాయపరించింది. పలు చోట్ల గాయాలు కావడం.. చాలా సేపటి వరకు రక్తపుధార ఆగకపోవడంతో ఆమె మరణించినట్టుగా సమాచారం. కాగా, ఈ కేసును అధ్యయనం చేసిన ఫోరెన్సిక్ నిపుణుడు రోజర్ బైర్డ్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియన్ వాసులను హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసైనా వయసు పైబడినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఆ మహిళ పేరు, ఇతర వివరాలను మాత్రం అక్కడి మీడియా సంస్థలు వెల్లడించలేదు.
అమ్మ నా కోడి!

Related tags :