మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మెగా కుటుంబానికి మంచి క్రేజ్ ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా హక్కుల్ని రూ.19.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ జిల్లాల్లో ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమా హక్కులు కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదని, ‘సైరా’ రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే. ‘సైరా’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది.
₹19.5కోట్లకు గోదావరి జిల్లా హక్కులు

Related tags :