Agriculture

మరోసారి ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచారు

Prakasam Barrage Gates Opened Once Again

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లు మరోసారి తెరచుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద 30 వేల క్యూసెక్కులను దాటడంతో, బ్యారేజ్‌ 10 గేట్లను తెరచిన అధికారులు దిగువకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశామని, వరద పెరిగే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని యంత్రాంగానికి సూచించామని కఅష్ణా జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాలువల ద్వారా దాదాపు 20 వేల క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని తెలిపారు. పులిచింతల క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగానే ప్రకాశం బ్యారేజ్‌ కి వరద పెరిగింది.