Politics

ఏపీ క్యాబినెట్ 100రోజుల సమావేశ నిర్ణయాలు ఇవి

AP Cabinet 100 Days Meet Decisions

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాటి వివరాలు ఇవి.

పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లోకి ఆర్టీసీ విలీనానికి ఆమోదం:

ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికను ఆమోదించిన మంత్రివర్గం. ఆర్టీసీ ఉద్యోగస్తులందర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు అవుతుంది

ఇందులో వీరందర్నీ రీ రిజిగ్నేట్‌ చేయాలన్న ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సును ఆమోదించిన మంత్రివర్గం. ఈ ప్రక్రియను మూడు మాసాల్లో పూర్తిచేయాలని రవాణాశాఖ, ఆర్థికశాఖ, న్యాయశాఖ, సాధారణపరిపాలన శాఖలకు సీఎం ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలూ, నియమ నిబంధనలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి

ప్రభుత్వ ఉద్యోగుల్లానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకి పెంచుతారు. బస్సు ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్సు ఛార్జీల నియంత్రణ కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

ఈ విలీనం ద్వారా 3300 కోట్ల ఆర్థిక బాధ్యతను చేపట్టనున్న ప్రభుత్వం

ఇసుక మాఫియాను అరికట్టే కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం:

ఇసుక తవ్వకం, రవాణాలను చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌. పర్యావరణం దెబ్బతినకుండా గతంలో ఉన్న ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్‌ పాలసీ

సరసమైన ధరకు ఇసుక లభించేలా పాలసీలో విధివిధానాలు

గతంలో అక్రమ పద్ధతుల్లో ఇసుకకు భారీగా ముట్టాచెప్పాల్సిన పరిస్థితి

అప్పటి రేట్లతో పోలిస్తే.. భారీగా తగ్గనున్న ఇసుక ధర

చట్ట పద్ధతిలో నేరుగా వినయోగదారుకు మాఫియాతో సంబంధం లేకుండా చేరనున్న ఇసుక

ఇవ్వాళ్టికి 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు

వీటిని 70 నుంచి 80 వరకూ అక్టోబరు నాటికి పెంచనున్న ప్రభుత్వం

క్రమేణా ఇంకా పెంచనున్న ప్రభుత్వం. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయం, అక్కడ నుంచి రవాణా ఖర్చు అదనం

టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90లు రవాణా ఖర్చు

10 కిలోమీటర్ల లోపు వరకూ ట్రాక్టర్ల ద్వారా రవాణా, రవాణా ఖర్చు రూ.500

పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యత ఏపీఎండీసీదే. క్యూబిక్‌ మీటరుకు రూ.60లు రైతులకు చెల్లించనున్న ఏపీఎండీసీ

లోండిగ్‌ రూపంలో, తవ్వకాల రూపంలో రైతులకు ఎలాంటి భారం ఉండదు, అవన్నీ ఏపీఎండీసే భరిస్తోంది

ఇప్పటివరకూ 100 రీచ్‌లు సిద్ధంచేసిన ఏపీఎండీసీ

31 చోట్ల డీ సిల్టేషన్‌ చేయనున్న ఏపీఎండీసీ. 82 చోట్ల పట్టా భూములను గుర్తించిన ఏపీఎండీసీ

ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనంలో జీపీఎస్‌ ఏర్పాటు

రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు, స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారుకు వెళ్లేంత వరకూ వాహనాల్లో జీపీఎస్‌

అనుమతి లేని వాహనాలు ఇసుక రవాణా చేయకూడదు

ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేధం

ప్రత్యేక హోదాకోసం పోరాటంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ మంత్రివర్గ నిర్ణయం

ప్రాసిక్యూషన్‌ విత్‌డ్రా చేయించడానికి కేబినెట్‌ ఆమోదం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వికలాంగులు, భవన మరియు ఇతర

వైయస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాలు:

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు. 2014 నుంచి 2019 వరకూ పతకాలు సాధించిన వారికి చెల్లింపు

గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యానికి గురైన వీరందరినీ గుర్తించి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం

రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయింపునకు నిర్ణయం
ఇప్పటివరకూ 162 మంది దరఖాస్తు చేశారు
బంగారు పతకానికి రూ. 5లక్ష, వెండి పతకానికి రూ.4లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు
జూనియర్, సబ్‌ జూనియర్‌స్థాయిలో పతకాలు సాధించని వారికీ నగదు ప్రోత్సహకాలు
వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాపింయన్‌షిప్‌ సాధించిన సింధుకు కేబినెట్‌ అభినందనలు

ఆంధ్య్రాబాంకు విలీనంపై చర్చించిన రాష్ట్ర కేబినెట్‌

భోగరాజు పట్టాభిసీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్‌ డిమాండ్‌

ప్రధానికి సీఎం లేఖరాయాలని నిర్ణయించిన కేబినెట్‌

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూ కేటాయింపు చేస్తూ మంత్రివర్గ నిర్ణయం. రాకెట్‌ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న డీఆర్డీఓ

చిత్తూరు, కడప జిల్లాల్లో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్‌ లెవల్‌ పంపింగ్‌ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం

నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్‌ కోసం

20.19 ఎకరాలు దక్షిణమధ్య రైల్వేకు కేటాయింపు

బలిమెల ఘటనలో అమరడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో 10 సెంట్ల భూమి కేటాయింపు.

మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్ని మంత్రివర్గం

భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం

మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు, మంత్రివర్గం ఆమోదం. 2005 నుంచి మావోయిస్టులపై కొనసాగుతున్న నిషేధం.

నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. రూ. 3216.11 కోట్ల టెండర్‌ను రద్దుకు కేబినెట్‌ ఆమోదం

రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం

కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం

నియమాలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25శాతం మేర అయిన

ఇచ్చిన రూ.780 కోట్ల మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లను రికవరీకి నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించిన మంత్రివర్గం.