ట్విట్టర్లో సీఎం జగన్ పై విరుచుకుపడిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియేదర్. పాస్టర్ల కు గౌరవ వేతనం పై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివో ను లింక్ చేసి ప్రశ్నలు వేసిన దియోధర్. పాస్టర్ల గౌరవ వేతనం కోసం ప్రభుత్వ నిధులతో సర్వే చేయించడం ఏమిటి? మీ ప్రభుత్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. ఒక మతానికే అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అన్ని మతాల్లోనూ పేదలు ఎంతో మంది ఉన్నారు. వారందర్నీ విస్మరించి.. కేవలం పాస్టర్లకే ఐదు వేలు ఎలా ఇస్తారు? జగన్ రియల్ ఎజెండా ఏమిటో చెప్పాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన దియోదార్.
It's blasphemous on the part of a govt to favor one religion over another using state govt funds,especially when pastors mock & proselytize deprived & poor people of other religion.Monthly stipend to pastors will add fuel to fire.What's ur real agenda @ysjagan?#Jagan4Conversion pic.twitter.com/yDsnOk33tR
— Sunil Deodhar (@Sunil_Deodhar) September 4, 2019