కాక్కాముట్టై చిత్రంతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీ ఐశ్వర్య రాజేష్. కనా చిత్రంలో కథానాయకురాలిగా నటించి తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ప్రస్తుతం ‘నమ్మవీట్టు పిళ్లై’ చిత్రంలో శివకార్తికేయన్‌కు సోదరిగా నటిస్తున్నారు. అదేవిధంగా విక్రమ్ ప్రభు కథానాయకుడిగా పేరు ఖరారు కాని మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కథానాయకురాలి స్థాయికి ఎదిగిన ఆమె మళ్లీ సోదరి వంటి పాత్రల్లో నటించడానికి కారణమేమిటని ప్రశ్నించగా.. ఇమేజ్ కంటే నచ్చిన పాత్రలు పోషించడమే ధ్యేయంగా పెట్టుకున్నానన్నారు. పిన్న వయస్సులోనే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించినట్లు గుర్తుచేశారు. ఆ చిత్రంతో తన జీవితం మలుపు తిరిగిందని, అలాంటి పాత్రలే తన ఇమేజ్‌ను పెంచుతున్నాయన్నారు. ఈ కారణంగానే సోదరి పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. గతంలో అలనాటి నటుడు శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించిన ‘పాసమలర్’ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ సావిత్రి సోదరి పాత్ర పోషించి ప్రేక్షకుల మనస్సు దోచుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇమేజ్ నాకు ముఖ్యం కాదు
Related tags :