అమ్మ అనే మాటలోని కమ్మదనం కోసం ప్రతి మహిళ తహతహలాడుతుంది. నవమాసాలు మోసి మరో జన్మలాంటి ప్రసవం అయ్యాక బిడ్డలను చూసి మురిసిపోతుంది. తన ప్రసవవేదనంతా మర్చిపోతుంది. అదీ అమ్మలోని గొప్పదనం. అలాంటి అదృష్టం కోసం స్త్రీలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారిలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన 73 ఏళ్ల మంగాయమ్మ ప్రత్యేకం. పెళ్లై 57 ఏళ్లు గడుస్తున్నా.. అమ్మ అనిపించుకోవాలనే తపనతో లేటు వయస్సులో గర్భం దాల్చింది. ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. గుంటూరులోని కొత్తపేట అహల్య ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
73వ ఏట ఇద్దరు ఆడపిల్లలను కనింది
Related tags :