అతిలోక సుందరి శ్రీదేవి విగ్రహం సింగపూర్ లో కొలువుదీరింది. ఈ విగ్రహన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆవిష్కరించారు. సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో దీన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషీ కపూర్ లు కూడా పాల్గొన్నారు. శ్రీదేవి నటించి సూపర్ హిట్ అయిన సినిమా ‘మిస్టర్ ఇండియా‘లోని లుక్ ఆధారంగా ఈ విగ్రహన్ని సిద్ధం చేశారు. శ్రేదేవి విగ్రహన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు మ్యూజియం నిర్వాహకులు.చాలా పాపులర్ లుక్ ను విగ్రహం కోసం ఎంపిక చేశారు. పలు భాషల్లో నటించిన శ్రీదేవి దేశంలోనే ఎంతో పాపులర్ హీరోయిన్ గా వెలుగొందిన విషయం తెలిసిందే. ఆమె ప్రమాదవశాత్తూ దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో బాత్ టబ్ లో జారి పడి మరణించిన విషయం తెలిసిందే. గతంలో ప్రకటించినట్లుగానే సింగపూర్ మ్యూజియం ఆమె విగ్రహన్ని ఏర్పాటు చేసింది.
సింగపూర్‌లో శ్రీదేవి
Related tags :