Politics

భారత యాత్రికులకు పాకిస్థాన్ వీసా అక్కర్లేదు

Indian Pilgrims Doesnt Need Pakistan Visa To Visit Gurudwara

భారత యాత్రికులు పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా వీసా లేకుండానే ప్రయాణించేందుకు భారత్, పాకిస్తాన్ లు బుధవారం అంగీకరించాయి. ఈ విషయాన్ని చెప్పారు అధికారులు. పంజాబ్‌లోని అమృతసర్ జిల్లాలోని అటారీలో రెండు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. గురుద్వారాకు యాత్రికులను అనుమతించాలంటే సర్వీస్ ఫీ ఉండాలని పాక్ పట్టుపట్టింది. కానీ అందుకు భారత ప్రతినిధులు అంగీకరించలేదు. అలాగే, తమ దేశంలో ఉన్న గురుద్వార ఆవరణలో ఇండియన్ కాన్సులర్ లేదా ప్రొటోకాల్ అధికారులు ఉండడాన్ని కూడా అనుమతించలేదు. అయితే, తన వైఖరిపై తిరిగి ఆలోచించుకోమని భారతీయ అధికారులు పాక్ ను కోరారు. ఈ సమావేశంలో కారిడార్‌పై ముసాయిదా ఒప్పందాన్ని ఖరారు చేయలేదని హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శా ఎస్‌సి ఎల్ దాస్ చెప్పారు. ప్రవాస భారత పౌరసత్వం (ఓసిఐ) కార్డు ఉన్న భారత సంతతివారు కూడా కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారను సందర్శించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.