Movies

బాలీవుడ్ ఎంట్రీ

Rashmika Mandanna Enters Bollywood

కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన రష్మిక మందన్న, సౌత్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. కోలీవుడ్లోనూ విజయ్ సరసన నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ భామకు సంబంధించి మరో ఆసక్తికర వార్త మీడియా సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ భామను ఓ బాలీవుడ్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో మంచి విజయం సాధించిన ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ రీమేక్ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన పాత్రను బాలీవుడ్లో రష్మిక పోషించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.