Fashion

గోరువెచ్చని నీటితోనే సిల్కు దుస్తుల్ని ఉతకాలి

గోరువెచ్చని నీటితోనే సిల్కు దుస్తుల్ని ఉతకాలి-silk-clothes-must-be-washed-using-luke-warm-water

సిల్కు దుస్తులు ఉతుకుతున్నారా… ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎక్కువకాలం మన్నుతాయి.
* గోరువెచ్చని నీటితోనే సిల్కు దుస్తుల్ని ఉతకాలి. ఒకవేళ వాటిపై డ్రైక్లీన్‌ అని రాసి ఉంటే ఆ పద్ధతిని ఎంచుకోవాలి.
* ఈ దుస్తుల్ని ఉతికేందుకు గాఢత తక్కువగా ఉన్న డిటర్జెంట్‌ ఎంచుకోవాలి. బ్లీచ్‌ వాడకపోవడమే మంచిది.
* ముదురు రంగు దుస్తులు ఉతికేముందు ఓ పని చేయండి. చీర లేదా డ్రెస్‌ అంచును… కొద్దిగా ఉతికి చూడండి. రంగు పోతోందనుకుంటే.. డ్రైక్లీనింగ్‌ చేయించడమే మంచిది.
* వెడల్పాటి టబ్బు నిండా గోరువెచ్చని నీటిని నింపాలి. అందులో చాలా కొద్దిగా డిటర్జెంట్‌/గాఢత తక్కువగా ఉండే షాంపూ/ బాడీవాష్‌… ఇలా ఏదో ఒకటి వేసి, దుస్తుల్ని నానబెట్టాలి. ఐదు నిమిషాల తరువాత ఆ నీటిని వంపేసి చల్లని నీరు, కప్పు వెనిగర్‌ వేయాలి. దుస్తులకు అంటుకున్న సబ్బు పోతుంది. ఇలా చేస్తే అవి ఎక్కువకాలం మన్నుతాయి.
* వాటిపై మరక పడిన వెంటనే… నిమ్మరసం, వెనిగర్‌ కలిపి రాసి ఐదు నిమిషాల తరువాత ఉతికి చూడండి. అప్పటికీ పోకపోతే డ్రైక్లీనింగ్‌ చేయించండి.
* ఒకవేళ వాషింగ్‌ మెషీన్‌లో వీటిని ఉతుకుతోంటే… తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. డ్రైయ్యర్‌లో దుస్తులు ఆరబెట్టకూడదు. అప్పుడే మడతలు పడకుండా ఉంటాయి.